గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో చేరిక వార్తలపై సుచరిత క్లారిటీ-కాంగ్రెస్ లో ఉన్నప్పుడే భర్త అడ్డుచెప్పలేదు-ఇప్పుడు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సీనియర్ నేతగా, జగన్ పాత కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన మహిళా నేత మేకతోటి సుచరిత టీడీపీలోకి ఫిరాయించబోతున్నట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. దీనికి ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆమె భర్త దయాసాగర్ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో సుచరిత తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. అయితే ఇవాళ వాటిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

 టీడీపీలోకి మేకతోటి సుచరిత ?

టీడీపీలోకి మేకతోటి సుచరిత ?

వైసీపీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత టీడీపీలోకి వెళ్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. జగన్ తొలి కేబినెట్ లో హోంమంత్రిగా పదవి దక్కించుకున్న సుచరితను ఆ తర్వాత జగన్ పలు కారణాలతో కొనసాగించలేదు. ఆమె స్ధానంలో మరో మంత్రి తానేటి వనితకు ప్రమోషన్ ఇచ్చి హోంమంత్రిని చేశారు. దీంతో అప్పటి నుంచి సుచరిత అసంతృప్తిగా కనిపిస్తున్నారు. దీనికి తోడు పార్టీ వ్యవహారాల్లోనూ తనకు ప్రాధాన్యం దక్కట్లేదని కినుక వహించారు. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా ఉన్న ఆమె భర్త దయాసాగర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన భర్త ఏ పార్టీలో ఉండే తాను అక్కడే ఉండాలిగా అంటూ సుచరిత చేసిన వ్యాఖ్యలతో ఆమె టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం మరింత ముదిరింది. దీనిపై ఆమె ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

 ఫిరాయింపుపై సుచరిత క్లారిటీ

ఫిరాయింపుపై సుచరిత క్లారిటీ

టీడీపీలోకి తాను ఫిరాయించబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఇవాళ సుచరిత స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సుచరిత, అసలేం జరుగుతోందో చెప్పేశారు. అలాగే తన భవిష్యత్ వ్యూహాలపైనా క్లారిటీ ఇచ్చారు. దీంతో సుచరితపై జరుగుతున్న ప్రచారంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది. అదే సమయంలో వైసీపీ అధిష్టానం నుంచి ఈ అంశంపై ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎందుకొచ్చిన పంచాయతీ అనుకుని ఆమె క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

 ఉంటే వైసీపీలో, లేకపోతే ఇంట్లో

ఉంటే వైసీపీలో, లేకపోతే ఇంట్లో

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సుచరిత ఖండించారు. తాను
ఉంటే వైసీపీలో ఉంటా లేకపోతే ఇంట్లో ఉంటా అంటూ క్లారిటీ ఇచ్చేశారు. తద్వారా తాను వైసీపీలోనే కొనసాగబోతున్నట్లు సుచరిత క్లారిటీ ఇచ్చినట్లయింది. అలాగే తన భర్త దయాసాగర్ టీడీపీలో చేరుతున్నారని ఎవరు చెప్పారంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. కొంతకాలంగా దయాసాగర్ టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుచరిత దీనిపైనా క్లారిటీ ఇచ్చారు.

 భర్త దయాసాగర్ పైనా క్లారిటీ

భర్త దయాసాగర్ పైనా క్లారిటీ

తన భర్త దయాసాగర్ టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా మేకతోటి సుచరిత ఖండించారు. అదంతా
అంతా సోషల్ మీడియా ప్రచారమే అన్నారు. ఎవరికి తోచినట్లు వారు రాసుకుంటున్నారని సోషల్ మీడియా వార్తలపై ఆమె మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తన భర్త దయాసాగర్ తాను వైసీపీలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదని సుచరిత మరో క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ ను ఎదిరించి జగన్ వైసీపీ పెట్టిన నేపథ్యంలో దయాసాగర్ పై ఒత్తిడి ఉన్నా వైసీపీలోకి వెళ్లేందుకు అడ్డుచెప్పలేదని ఆమె స్పష్టం చేశారు.

English summary
former ysrcp minister mekathoti sucharita clarified on tdp joining- here is what she says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X