జగన్ సన్నిహిత నేత సంచలన పోస్ట్..గుట్టు మొత్తం బయటపెట్టేశారు..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుల్లో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన జగన్ వెంటే నడించారు.2012, 2014,2019 వరుస ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో శ్రీకాంత్ రెడ్డి వీప్‌గా కూడా పని చేశారు.అయితే గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన సంవత్సరం తర్వాత తన ఓటమిపై స్పందించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
2019తో పోలిస్తే 2024లో 30వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. కానీ 2024లో వైయస్సార్సీకి 95వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైయస్సార్సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ, టీడీపీకి మాత్రం 96వేల ఓట్లు వచ్చాయి. అంటే 2019తో పోలిస్తే,
— Gadikota Srikanth Reddy (@GSrikanthYSRCP) June 8, 2025
2012 ఉప ఎన్నికతో పాటు 2014, 2019, 2024 ఎన్నికల్లో రాయచోటిలో పోలైన ఓట్లపై సమగ్ర పరిశీలన అవసరమని ఆయన డిమాండ్ చేశారు.శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు 62 వేల నుంచి 66 వేల ఓట్లు రాగా, వైసీపీకి 92 వేల నుంచి 98 వేల ఓట్లు లభించాయి. 2014తో పోలిస్తే 2019లో ఓట్ల పెరుగుదల కేవలం 200 ఓట్లలోనే పరిమితమైందని ఆయన గుర్తు చేశారు.

అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా 30 వేల ఓట్ల అసాధారణ పెరుగుదల చోటు చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు. ఈ పెరుగుదలపైనే ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 95 వేల ఓట్లు, టీడీపీకి 96 వేల ఓట్లు వచ్చినట్లు గణాంకాలను పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉండగానే, అదనంగా పోలైన 30 వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్లాయో అర్థం కావడంలేదని, ఇది సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు.
ఓట్ల పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే జరిగిందంటే, ఇందులో లోటుపాట్లు ఉన్నాయని, తక్షణమే దీనిపై విచారణ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. ఈ 30 వేల ఓట్ల మిస్టరీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications