వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు చుట్టుగుంట దగ్గర ఆయన్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

చేబ్రోలు కిరణ్ కుమార్ ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అంతకుముందు.. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్ చేసింది. టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి తరలించారు.












Click it and Unblock the Notifications