జగన్‌తో టచ్‌లో మాజీలు: వాళ్లపై 'ఔట్ డేటెడ్' ముద్ర!, వర్కౌట్ అవుతుందా?

ప్లీనరీతో మంచి ఊపు మీదున్న వైసీపీ అధినేత జగన్‌కు.. మాజీలు టచ్ లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిలు.

కడప: ప్లీనరీతో మంచి ఊపు మీదున్న వైసీపీ అధినేత జగన్‌కు.. మాజీలు టచ్ లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిలు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ వైసీపీ గూటికి చేరేలా మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఆర్థికంగా బలమైన నేపథ్యమున్న వీరిద్దరూ.. గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో వీరిని పార్టీలోకి తీసుకొచ్చినంత మాత్రానా వైసీపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.

గతంలోను డీఎల్ చేరికపై:

గతంలోను డీఎల్ చేరికపై:

డీఎల్ వైసీపీ చేరికకు సంబంధించి గతంలోను పలు ఊహాగానాలు వినిపించినా.. అవన్ని కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో వైసీపీ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటోలు దర్శనమివ్వడం ఇక పార్టీలోకి ఆయన రాక లాంఛనమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేసింది. అయితే ఆయన మాత్రం రాజకీయ పున:ప్రవేశానికి దూరంగా ఉంటూనే వస్తున్నారు.

కొత్త తలనొప్పేనా?

కొత్త తలనొప్పేనా?

డీఎల్ రవీంద్రారెడ్డి గనుక వైసీపీలోకి వస్తే.. మైదుకూరు నియోజకవర్గంలో విభేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైసీపీ నేతే కావడంతో.. డీఎల్ చేరిక కొత్త తలనొప్పులకు దారితీయవచ్చు. మరి జగన్ ఏ లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారో అంతుచిక్కడం లేదు.

కాంగ్రెస్‌తో కష్టమని.. పనబాక లక్ష్మి!

కాంగ్రెస్‌తో కష్టమని.. పనబాక లక్ష్మి!

ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు ఏపీలో ప్రతికూల పవనాలు వీచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మూడేళ్లు కావస్తున్నా.. కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రధాన పోరు ఇప్పటికీ టీడీపీ-వైసీపీల మధ్యే ఉండటంతో.. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దంపతులు జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఔట్ డేటెడ్ అన్న ముద్ర!:

ఔట్ డేటెడ్ అన్న ముద్ర!:

గతంలో వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా.. భవిష్యత్తు రాజకీయాల కోసం జగన్ పార్టీకి దగ్గరవాలని పనబాక దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పనబాక లక్ష్మి దంపతుల చేరిక వైసీపీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.

డీఎల్ రవీంద్రా, పనబాక లక్ష్మి కొన్నాళ్లుగా రాజకీయ తెర మీద అంతగా కనిపించడం లేదు. జనంలోను వీరు ఔట్ డేటెడ్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. మరి జగన్ వీరిద్దరితో ఏం ప్లాన్ వర్కౌట్ చేయబోతున్నారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+