గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ.. ఎందుకంటే!!
ఏపీలో ప్రజా ప్రతినిధులకు కోర్టు ధిక్కారం సర్వ సాధారణ అంశంగా మారింది. కేసులను విచారిస్తున్న క్రమంలో కోర్టుకు హాజరుకాకపోవటం, కనీసం అందుకు కారణాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లటం కూడా చేయని నాయకులు ఉన్నారు. ఇక ఆ కోవకే చెందుతారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ .
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. వల్లభనేని వంశీ పై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టు ఏకంగా నాలుగు అరెస్టు వారెంట్లను జారీ చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీపై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతుండగా, విచారణకు ఆయన ఇప్పటివరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రసాదంపాడు లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో గత విచారణ లోనే బెయిలబుల్ వారెంట్ ను న్యాయస్థానం జారీ చేసింది. ఈరోజు కూడా విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అరెస్టు వారెంట్ లపై వల్లభనేని వంశీ కౌంటర్ కి దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టు జారీ చేసింది అరెస్ట్ వారెంట్లు మాత్రమే కాబట్టి ఆయన కోర్టు విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయారు అనే విషయాలను వివరిస్తూ అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయనున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న క్రమంలో ప్రజాప్రతినిధుల పైన కేసులు నమోదు ఆయన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ పై కూడా నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులలో విచారణకు ఆయన హాజరు కాకపోవడం, కోర్టు ధిక్కారంగా పరిగణించి ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లను జారీ చేసింది.












Click it and Unblock the Notifications