యువతిపై గ్యాంగ్ రేప్, నలుగురి అరెస్టు: ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య
హైదరాబాద్: వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో 4 రోజుల క్రితం ఓ యువతిపై సామూహిక అత్యాచారయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేశారు. కాబోయే భర్తతో వెళ్తుండగా అతనిపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం
హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్లో కిడ్నాప్ అయిన 8 ఏళ్ల బాలుడు సాన్విత్ కథ సుఖాంతమైంది. సాన్విత్‌ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు సికింద్రాబాదులోని బోయిన్‌పల్లిలో వదలి వెళ్లారు.

అయితే, పోలీసులు కిడ్నాపర్లు సాన్విత్ తండ్రికి చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా వారిని వెంబడించి, ఐదుగురు దుండుగులను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కి పాల్పడిన దుండుగుల్లో మహిళ కూడా ఉంది. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు ఆనందించారు.
ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య
హైదరాబాదు నగరంలో కుటుంబ కలహాలతో ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లో ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న మహేష్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే మహేష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications