AP Elections 2024: 4 కంటెయినర్లలో 2 వేల కోట్లు- వదిలేసిన పోలీసులు-! కారణమిదే..
ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల భవితవ్యాన్ని డబ్బు తేల్చబోతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఈసీ అధికారులు పలు చోట్ల భారీగా నగదును పట్టుకుంటున్నారు. ఇప్పటికే 800 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు ఈసీ లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇవాళే అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.2 వేల కోట్లు పట్టుబడ్డాయి.

అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో పోలీసులు ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో నాలుగు భారీ కంటెయినర్లు గుర్తించారు. వాటిని ఆపి తనిఖీలు చేశారు. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చిన్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ కు ఈ నాలుగు కంటైనర్లు సెక్యూరిటీతో వెళుతున్నట్లు గుర్తించారు. అలాగే ఇందులో 2 వేల కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి ఆధారాలు అడిగారు.

వాటిని తీసుకెళ్తుున్న సిబ్బంది ఎన్నికల అధికారులకు తగిన ఆధారాలు సమర్పించారు. ఈ నాలుగు కంటైనర్లు రిజర్వు బ్యాంకుకు సంబంధించినవిగా వారు ఆధారాలు ఇచ్చారు. ఇవి సరిపోలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని పోలీసులు విడుదల చేశారు. దీంతో నాలుగు కంటెయినర్లు సజావుగా వెళ్లిపోయాయి. అసలే ఎన్నికల సమయం కావడం, భారీ ఎత్తున నగదు దొరకడంతో అధికారులు తొలుత ఆందోళనకు లోనయ్యారు. చివరికి ఆధారాలు ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications