ఔటర్‌లో ప్రమాదం, లారీని ఢీకొన్న డిసిఎం: 4గురి మృతి

ఈ ఘటనలో హబూబాఖాన్, మూలానబి, సమ్రీన్, దస్తగిరిలు మృతి చెందారు. రాజేంద్ర నగర్‌కు చెందిన పద్దెనిమిది మంది కర్నాటకలోని బీదర్‌లో జరిగిన ఓ వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బీదర్ నుండి బయల్దేరిన డిసిఎం వ్యాను మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వట్టినాగులపల్లి వద్దకు రాగానే ఔటర్ రింగు రోడ్డు పైన ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తి హత్య
మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి మర్మాంగాలు కోసి దారుణంగా హింసించి హతమార్చారు.












Click it and Unblock the Notifications