విషాదం: పిల్లలను చంపేసి, భార్యాభర్తలు ఉరేసుకున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నంం: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దంపతులు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన విశాఖపట్నంలో జరిగింది.

వారినికి కనిగిరికి చెందినవారిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసైన రాజేశ్ రెడ్డిని కుటుంబ సభ్యులు దరి చేరనీయకపోవడంతో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అన్న కూతురిని కిడ్నాప్ చేయడంతో రాజేశ్ రెడ్డి కుటుంబాన్ని తండ్రీ, అన్న దూరంగా పెట్టడం వల్ల వారు విశాఖపట్నం వచ్చి అద్ద ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం.

 విశాఖలో అద్దెకు ఉంటూ..

విశాఖలో అద్దెకు ఉంటూ..

ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి రాజేశ్‌రెడ్డి(35), భార్య సౌమ్య(30), పిల్లలు విష్ణు(7), జాహ్నవి(5)తో కలసి విశాఖ శివారులోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న రాజేశ్‌ గురువారం ఉదయం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు.

 బంధువులకు ఫోన్‌లో చెప్పి...

బంధువులకు ఫోన్‌లో చెప్పి...

తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని రాత్రి 7 గంటల సమయంలో చెన్నైలో ఉంటున్న బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు. బంధువులు వెంటనే విశాఖ ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ముస్తఫా కాలనీకి చేరుకుని రాజేశ్‌ ఇంటి కోసం గాలించారు. కొంతసేపటికి రాజేశ్‌ ఉంటున్న ఇంటిని గుర్తించారు.

 అప్పటికే శవాలై..

అప్పటికే శవాలై..

తలుపులు బద్దలుకొట్టి పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. వారు చూసేసరికే రాజేశ్, సౌమ్య ఉరేసుకుని శవాలై కనిపించారు. పిల్లలు విష్ణు, జాహ్నవి శవాలు మంచంపై పడి ఉన్నాయి. ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మరణానికి కుటుంబ తగాదాలే కారణమని అందులో రాసినట్లు సమాచారం.

 పిల్లలకు ముందు విషమిచ్చి..

పిల్లలకు ముందు విషమిచ్చి..

పిల్లలకు ముందు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారు ఆరు నెలల నుంచి వారు అక్కడ ఉంటున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. పక్కవాళ్లతో కూడా గొడవలు లేవు..

 దుర్వ్యసనాలకు బానిసై..

దుర్వ్యసనాలకు బానిసై..

దుర్వ్యసనాలకు బానిసైన రాజేశ్ రెడ్డి అప్పుల పాలైనట్లు చెబుతున్నారు. అతని తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాగా, అన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రాజేష్ రెడ్డి తండ్రి, అన్న కుటుంబాలతో కలిసి కనిగిరిలోని సొంత ఇంట్లోనే ఉంటున్నారు. రాజేశ్ రెడ్డి కనిగిరిలో ఐటిఐ చదివాడు. తర్వాత అతడి తల్లితండ్రులు పట్టణంలోనే ఓ దుకాణం పెట్టించారు. నర్సరావుపేటకు చెందిన సౌమ్యనిచ్చి వివాహం చేశారు. రాజేశ్ రెడ్డి బెట్టింగులు, జూదం ఇతర దుర్వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. దాంతో దుకాణం మూసేసి, విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తూ వచ్చాడు.

 అన్న కూతురిని కిడ్నాప్ చేశాడు..

అన్న కూతురిని కిడ్నాప్ చేశాడు..

ఆస్తి కోసం రాజేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ వచ్చాడు. గతంలో ఓసారి డబ్బు కోసం విజయవాడకు చెందిన మిత్రుల సాయంతో తన అన్న శ్రీనివాసరెడ్డి కూతురు సహస్రను కిడ్నాప్‌ చేశాడు. పోలీసులు ఆ బాలికను కాపాడి, రాజేశ్వరరెడ్డిని జైలుకు పంపించారు. తర్వాత బెయిలుపై బయటికొచ్చాడు. అయితే,, తల్లిదండ్రులు, అన్న అతన్ని దగ్గరకు రానీయలేదు. దాంతో భార్యాపిల్లలతో కలిసి విశాఖపట్నం చేరుకున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Couple in Viskhapatnam of Andhra Pradesh killing their children and hanged to death.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి