షాక్ :లేడీస్ హస్టల్ లోకి ప్రవేశించిన నలుగురు యువకులు ఏం చేశారంటే?
అమ్మాయిల హస్టల్ లో అర్థరాత్రి పూట నలుగురు యువకులు ప్రవేశించి విధ్యార్థినుల భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో చోటుచేసుకొంది.
కర్నూల్ :అమ్మాయిల హస్టల్ లో అర్థరాత్రి పూట నలుగురు యువకులు ప్రవేశించి విధ్యార్థినుల భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో చోటుచేసుకొంది.
కర్నూల్ జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలలోకి శనివారం నాడు నలుగురు దుండగులు హస్టల్ లోకి ప్రవేశించారు.

హస్టల్ లోని యువతులను యువకులు భయబ్రాంతులకు గురిచేశారు. యువతుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్ళారు.
నిందితులు హస్టల్ లోకి ఎలా వచ్చారనేది అర్థం కావడం లేదని హస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. భయాందోళనలకు గురైన విద్యార్థినులు ప్రిన్సిఫల్ రామసుబ్బారెడ్డి సహయంతో ఫిర్యాదు చేశారు . ఈ ఫిర్యాదు ఆదారంగా నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications