వివాహేతర సంబంధం?: తల్లిని హత్య చేసిన కొడుకులు
ఆదిలాబాద్: జిల్లాలోని బైంసాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కన్న కొడుకులే తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీబాయి (55) అనే మహిళ తన స్వగ్రామం నుంచి ఉపాధి కోసం వచ్చి బైంసాలోని పురానా బజార్‌లో అద్దెకు ఉంటోంది. ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు. ఓ శుభ కార్యానికి వెళ్లి వచ్చిన వారు.. తమ తల్లిని అత్యంత దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు.
తమ తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై తమకు చాలా కాలంగా అనుమానంగా ఉందని నిందితులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం తమకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో బండరాళ్లు, కర్రలతో దాడి చేసి చంపామని తెలిపారు. కానీ తమలో ఇద్దరం మాత్రమే చంపామని, మిగిలిన ఇద్దరికీ హత్యతో సంబంధం లేదని చెప్పారు.

సమాచారం అందుకున్న పోలీసులు, హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లక్ష్మీబాయి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. కాగా, లక్ష్మీబాయి భర్త గతంలోనే మరణించగా, ఆమె కొడుకులు నలుగురూ వేర్వేరు చోట్ల ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో ఇద్దరికి వివాహమైంది.
ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం పిటిగావ్(ఎల్) గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన రాథోడ్ బద్దు పశువుల పాక వద్ద చెలరేగిన మంగలు ఇంట్లోకి ప్రవేశించడంతో వృద్ద దంపతులు రాథోడ్ బద్దు, రాథోడ్ గంగుభాయ్ మృతి చెందారు. మరో ఘటనలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి 8వ తరగతి విద్యార్థి నరేందర్ (16) మృతి చెందాడు. ఈ ఘటన దిలావర్ పూర్ మండలంలోని కాల్వగ్రామ శివారులో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications