ఏపీలో ఏడో విడ‌త ఉచిత రేష‌న్‌... రేపటి నుండే .. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతున్నసమయంలో నేటికీ ప్రజలకు అండగా ఉంటూ ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి కోల్పోవ‌డంతో వారికి భరోసా ఇవ్వటానికి పేద‌ల‌కు ఉచితంగా బియ్యం, స‌రుకులు పంపిణీ చేస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం. ఇప్ప‌టికే ఆరు విడత‌లుగా ఈ పంపిణీ కార్య‌క్ర‌మం జరిగింది.ఇక రేపటి నుండి ఏడో విడ‌త పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆదేశాల‌తో ప్రజలకు ఇప్పుడు కూడా ఉచిత రేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. దీని వల్ల రాష్ట్రంలోని 1.48 కోట్ల రేష‌న్‌కార్డుదారుల‌కు లబ్ధి చేకూర‌నుంది. క‌రోనా క‌ట్ట‌డికోసం లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మార్చి 29 నుంచి నేటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసింది ఏపీ ప్రభుత్వం .

 Free ration distribution seventh phase from tomorrow in AP.. Good News

ఇప్పుడు ఏడో విడత పంపిణీ కార్య‌క్ర‌మాన్ని రేప‌టి నుంచి ప్రారంభించ‌నుంది. ఒక్కొక్క‌రికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా అందించ‌నుంది. తమ ప్రభుత్వం ఇప్పటికి ఆరు విడతలుగా ఉచిత రేషన్ అందించిందని ఉచిత రేషన్‌ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి ఏపీ ప్రజలు కరోనా సమయంలో పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం గుడ్ న్యూస్ అనే చెప్పాలి .

Recommended Video

    Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+