ఏపీలో వారికి ఫ్రీ బైక్స్.. సువర్ణావకాశం మిస్ చేసుకోవద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా చదువుకునే వారికి, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే వారికి బాసట అందించడానికి శతవిధాల కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే దివ్యాంగులకు కూడా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు బాసటగా నిలవాలని నిర్ణయించిన సర్కార్ వారికి ఉచితంగా ట్రై మోటర్ బైక్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని వారికి తీపి కబురు అందించింది.

ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున బైక్స్
ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున ఈ వాహనాలను అందజేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం, అందులో 50 శాతం వాహనాలను మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో ట్రై మోటర్ బైక్ విలువ ఒక లక్ష 30 వేల రూపాయలు కాగా, వీటిని ఉచితంగా అందించనున్నారు.

Free tri motor bikes for disabled in AP Don t miss the golden opportunity

Take a Poll

ఈ ఫ్రీ బైక్స్ కావాలంటే అర్హతలు ఇవే
ఈ ఏడాది నవంబర్ 25వ తేదీ లోపు దివ్యాంగ అభ్యర్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 70 శాతం వైకల్యంతో ఉన్నవారికి ఈ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ ట్రై మోటర్ బైక్స్ కోసం అప్లై చేసుకోవాలనుకునే దివ్యాంగులు డిగ్రీ అంతకంటే పై స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులుగా ఉండాలి అలాగే స్వయం ఉపాధి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేసే వారై ఉండాలి.

దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే
పదవ తరగతి పాసై స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులకు కూడా 100% సబ్సిడీతో ఈ వాహనాలను అందజేస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 25వ తేదీ నాటికి 18 నుండి 45ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల లోపే ఉండాలి.

బంగారం లాంటి అవకాశం
అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల ద్వారా వాహనాలు తీసుకుని ఉండకూడదు. దరఖాస్తుదారుల పేరుతో గతంలో ఎటువంటి వాహనం ఉండకూడదు. ఇక గతంలో ట్రై మోటార్ వెహికల్ కోసం అప్లై చేసుకుని రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనుకునే దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈనెల 25వ తేదీ వరకే దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఉండడంతో త్వరపడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+