సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా "అలేఖ్య చిట్టి పికిల్స్" పంచాయతీ
మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్ని చేతులారా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో. అలేఖ్య చిట్టి పికిల్స్.. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశవిదేశాలకు కూడా ఆర్డర్ల మీద పంపిణీ చేస్తుంటారు. అలేఖ్య, చిట్టి, రమ్య ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు. వీరి బిజినెస్ ప్రమోషన్ కోసం వీరి ఇన్ స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరికి మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది.. వారి వ్యాపారానికి కూడా పబ్లిసిటీ లభించింది.
ఇక వారి ఫోన్ నెంబర్లకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే.. వారి దగ్గరున్న పచ్చళ్లు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్‌కు హాయ్ అని వాట్సాప్ చేస్తే.. అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో తక్కువలో తక్కువగా రూ.1200 ఉండటంతో.. రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు.

అయితే అందుకు ఘాటుగా స్పందించడమే కాకుండా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. నీ భార్యకు, లవర్ కు బంగారం ఏం కొనిపెడతావ్..నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడడమే కాకుండా చివర్లో పచ్చి భూతులు కూడా తిట్టారు. అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవ్వగా.. దానిపై రెస్పాండ్ అయిన నెటిజన్లు సదరు యువతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముష్టి పచ్చడికి అంత రేట్లు ఎందుకూ పెట్టడం..🤣😂
— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) April 1, 2025
Pickle rates❌ Asthi Papers✅
Must Use Earphones👀🎧 pic.twitter.com/3kf0xkKmZu
గత రెండు రోజులగా ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది. దాంతో ఇన్నాళ్లు మంచి పేరు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వాల్యూ పూర్తిగా పోయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాళ్లు ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతోపాటు.. వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. అంతే కాకుండా వెబ్ సైట్ సైతం క్లోజ్ చేశారు. కొత్త రిక్వెస్ట్‌లను సైతం స్వీకరించడం లేదు.
ఇక మరోవైపు తాజాగా.. మరో కస్టమర్ తో కూడా రేటు విషయంలో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఒక వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఊరగాయల ధరల్ని ఇంతనా.. అంటున్నావ్.. అసలు నువ్వు.. ప్రతి ఇంటికి వెళ్లి పాచీ పని చేసి బతుకు అంటూ కూడా అలేఖ్య సిస్టర్స్ లలో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతుంది. వీరిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరి దగ్గర అస్సలు పిక్కిల్స్ కొనొద్దని ట్రోల్స్ నడుస్తున్నాయి.
Okkokati bayataki vastunnayi 🙄
— Satya ™️ (@MSD_Prabhasatya) April 3, 2025
Now the victim is a lady customer pic.twitter.com/0GTHrrPdUp
మొత్తానికి ఈ ఇష్యూపై ముగ్గురు సిస్టర్స్ లో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఇద్దరి వ్యాఖ్యలను గమనిస్తే విషయాన్ని దారి మళ్లించేందుకు చేసిన చక్కటి కవర్ డ్రైవ్ లాగే అనిపిస్తుంది. సదరు కస్టమర్లకు కూడా క్షమాపణ చెప్పినట్టు రమ్య అనే అమ్మాయి ఇన్ స్టా వేదికగా వీడియో రిలీజ్ చేసింది. గతంలో వారిపై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రెస్పాండ్ అయితే అప్పుడు వారిని సపోర్ట్ చేసిన నెటిజన్లు తాపు చేసినప్పుడు కూడా శిక్ష వేస్తున్నారని అర్ధం అవుతోంది.
-
అడవి తల్లి ఒడిలో ఏనుగుల జోలపాట -
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications