చంద్రబాబు కోసం భవిష్యత్ తరం: ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన నారా బ్రాహ్మణి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని ఏపీ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బయటకు వచ్చేవరకు పోరాటం చేస్తామని చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కొందరు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ఇక తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చంద్రబాబుకు మద్దతు తెలపడం లో భాగంగా ఓ బాలుడు నారా బ్రాహ్మణి వద్దకు వచ్చాడు.

Future generation for Chandrababu: Nara Brahmani posted an interesting video!!

చంద్రబాబు లోకేష్ లకు మద్దతు తెలపడం కోసం దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఆ బాలుడు నారా బ్రాహ్మణి తో మాట్లాడాడు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు తాను పోరాటం చేస్తానని ఆ పిల్లవాడు బ్రాహ్మణి తో చెప్పాడు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ద్వారా ప్రజల కోసం పోరాటం చేశాడని ఆ బాలుడు బ్రాహ్మణి తో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

నారా బ్రాహ్మణి ఆ చిన్నారి బాలుడు మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ చిన్నారి బాలుడు పేరు అనిత్ కుమార్ అని తనకు చిరునవ్వు తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కు మద్దతు ఇవ్వడానికి ఆ బాలుడు వచ్చాడని బ్రాహ్మణి పేర్కొన్నారు.

చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఆ చిన్నారి తల్లిదండ్రులు వివాహం చేసుకుని ఒకటయ్యారు అని పేర్కొన్న నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాలను రక్షించడానికి తాను కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నానంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు కోసం చిన్నపిల్లలు కూడా పోరాటం చేస్తామని అంటున్నారని ఈ వీడియోను టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+