వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్వీ నోటీసులు బాధించాయి.. క్యాబినెట్‌లో ఎందుకు పెట్టలేదో వివరించా, షోకాజ్‌కు ప్రవీణ్ రిప్లై..

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఇంచార్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు వివరణను పంపించారు. తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని స్పష్టంచేశారు. ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదని వివరణలో పేర్కొన్నారు.

జీఏడీ తరఫున ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డులు, గ్రామ న్యాయాలయాల విషయంలో సీఎం నిర్ణయం మేరకు వ్యవహరించానని పేర్కొన్నారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. గ్రామ న్యాయాలయాల అంశం మంత్రివర్గం ముందుకు ఎందుకు తీసుకురాలేదని అంశాన్ని స్వయంగా ఎల్వీ సుబ్రమణ్యానికి వివరించానని తెలిపారు. అయినా తన వివరణను పట్టించుకోకుండా మసులుకున్నారని గుర్తుచేశారు.

gad secretary praveen prakash replay on ap ex cs notice

ఇదే అంశంపై తనకు నోటీసు ఇవ్వడం బాధించిందని గుర్తుచేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి వాణి వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడం ఏంటి అని అడిగారు. ప్రజలకు సత్వర న్యాయం, లబ్ది చేకూర్చేందుకు గోప్యత పాటించామని.. ఈ విషయాన్ని ఎల్వీకి వివరించానని ప్రవీణ్ చెప్పారు. కానీ ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ రాజకీయంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం జగన్ ఆదేశాలనే బేఖాతరు చేసినట్టు తెలుస్తోంది. పోస్టింగులను కూడా పక్కన పెట్టారని సమాచారం. బిజినెస్ రూల్స్ సవరణ, వైఎస్ఆర్ లైఫ్ టైం అచివ్‌మెంట్ అవార్డుల నిర్ణయం సీఎస్ సమక్షంలోనే జరిగాయని ఏపీ సర్కార్ చెబుతోంది. దీనికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో కూడా పెట్టాలనే సీఎం ఆదేశాలను ఎల్వీ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఎల్వీపై బదిలీ వేటు వేశారు. బదిలీ అయ్యాక ఆయన సెలువులో వెళ్లారు.

English summary
gad secretary praveen prakash replay on ap ex cs lv subramanyam notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X