'కలిసి నడవాలని.. రజనీకాంత్-పవన్ కళ్యాణ్‌ల 'ఓకే' కోసం ఎదురుచూపు'
రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురువారం అన్నారు.సౌతిండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక,సామాజిక,రాజకీయ
హైదరాబాద్/అమరావతి: సూపర్ స్టార్ రజనీకాంత్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురువారం అన్నారు.
సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రజనీకాంత్, పవన్ కళ్యాణ్ అంగీకారం కోసం ఎదురుచూపు
రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు తమ తరఫున ప్రతినిధులు వెళ్లి విధానాలను వివరించారని, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నామని గద్దర్ చెప్పారు. 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు.

అందుకే వారికి ఆహ్వానం
ఢిల్లీలో మాజీ ప్రధాని పిని నరసింహారావు ఘాట్ ఏర్పాటుకు స్థలం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని గద్దర్ నిలదీశారు. దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలు చూడాలనే 'సికా' ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్, రజినీకాంత్‌ను ఆహ్వానించామని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో ఏపీలో లెక్కలు
కాగా, సినిమా తారల వరకు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, భారత దేశమంతా రజనీకాంత్ పేరు ఇటీవల బాగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఆయన స్వయంగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే పరిస్థితి ఏమిటి అని.. ఇప్పటికే ఏపీలో టిడిపి, వైసిపిలు లెక్కలు వేసుకుంటున్నాయి.
Recommended Video


రజనీకాంత్‌పై సర్వత్రా ఉత్కంఠ
మరోవైపు, తమిళనాట రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఆయన చర్యలు రాజకీయ పార్టీ స్థాపించేలా కనిపిస్తోందని అంటున్నారు. అంతేకాదు, బీజేపీకి ఆయన దన్నుగా ఉండే అవకాశముందని అంటున్నారు.












Click it and Unblock the Notifications