Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శరవేగంగా గగన్‌యాన్: అడుగు దూరంలో ఇస్రో..!!

తిరుపతి: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు ఇక పుల్‌స్టాప్ పడినట్టే. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే కనిపిస్తోంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైనప్పటి నుంచే అది పని చేయడం మానేసింది.

విక్రమ్ ల్యాండర్‌‌ ద్వారా చంద్రుడిపైకి పంపించిన ప్రజ్ఞాన్ రోవర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ కూడా మూగబోయాయి.

Gaganyaan: ISRO to commence unmanned flight tests

ఈ పరిస్థితుల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. ఈ మిషన్ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గగన్‌యాన్ మిషన్ సమయంలో వ్యోమగాములు ఒత్తిడితో కూడిన భూమి లాంటి వాతావరణంలో ఉంటారు. అలాంటి క్రూ మాడ్యుల్‌ను వివిధ దశల్లో అభివృద్ధిలో చేస్తోంది.

టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం క్రూ మాడ్యుల్ అసెంబ్లింగ్, టెస్టింగ్ పనులను పూర్తి చేస్తోంది. త్వరలోనే ఈ క్రూ మాడ్యుల్‌ను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి పంపించనుంది. క్రూ మాడ్యుల్‌లోని ఏవియానిక్స్ సిస్టమ్స్ నావిగేషన్, సీక్వెన్సింగ్, టెలిమెట్రీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయల్ రిడెండెంట్ మోడ్.. వంటివి ప్రస్తుతం కాన్ఫిగరేషన్‌లో ఉన్నాయి.

ఈ మిషన్‌లో క్రూ మాడ్యుల్‌కు సంబంధించిన వివిధ వ్యవస్థల పనితీరును అంచనా వేయడానికి, ఫ్లైట్ డేటాను సేకరించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. తిరుగు ప్రయాణంలో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతాన్ని తాకేలా మిషన్‌ను సెట్ చేశారు. సముద్రంలో పడ్డ వెంటనే నౌకాదళ డైవింగ్ టీమ్‌.. దీన్ని సేకరిస్తుంది.

Gaganyaan: ISRO to commence unmanned flight tests

ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో. రాకెట్ క్రయోజెనిక్ ఇంజిన్‌ సామర్థ్యాన్ని పరీక్షించింది కూడా. తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద గల లిక్విడ్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌లో రాకెట్ ఇంజిన్‌ సీఈ-20ని 720 సెకెండ్ల పాటు మండించింది. ఈ టెస్ట్ విజయవంతంమైనట్లు తెలిపింది.

గగన్‌యాన్‌లో భాగంగా మనుషులను లో- ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది ఇస్రో. భూఉపరితలంపై నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తారు. అయిదు నుంచి ఏడు రోజుల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం మళ్లీ భూమిపైకి తిరిగి వస్తారు. క్రూ మాడ్యుల్ అంటే.. మనుషులను తీసుకెళ్లడానికి వీలుగా ఉండే క్యాబిన్, సర్వీస్ మాడ్యుల్ అంటే.. రెండు లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్స్‌‌ను పేలోడ్స్‌గా పంపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+