కేసీఆర్‌ను చూడాలనుంది, చూపిస్తారా?: గజ్వెల్ హెచ్ఐవీ చిన్నారులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చూడాలని ఉందని హెచ్ఐవీ పీడిత చిన్నారులు కోరుకుంటున్నారు. కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిపొందిన విషయం తెలిసిందే.
ఇదే నియోజకవర్గానికి చెందిన పలువురు చిన్నారులు ఆయనను చూడాలని కోరుకుంటున్నారు. వ్యాధిగ్రస్తులైన చాలామంది చిన్నారులకు తల్లిదండ్రులు కూడా లేరు. అలాంటి వారు కేసీఆర్‌ను చూడాలని ఆశపడుతున్నారు. మాకు హెచ్ఐవీ ఉందని, ఎప్పుడు చనిపోతామో తెలియదని, ఆలోగా కేసీఆర్‌ను చూపిస్తారా అని అడుగుతున్నారు.

గజ్వెల్ ప్రాంత అఏభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి హనుమంత రావు మంగళవారం గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రసంగం తర్వాత అక్కడ ఆశ్రయంలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన కలిశారు.
వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. మైకు తీసుకున్న చిన్నారులు.. తమకు కేసీఆర్‌ను చూడాలని ఉందని చెప్పారు. మిగతా వారు వారికి జత కలిశారు. కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాలో శ్రీజ అనే చిన్నారిని కలిసిన విషయం తెలిసిందే. ఆమె కోలుకుంటున్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications