అశ్రునయనాలతో...ముద్దుకృష్ణమనాయుడుకు అంతిమ వీడ్కోలు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

చిత్తూరు జిల్లా: వెల్లువలా తరలివచ్చిన అశేష జనవాహిని అభిమానులు అశ్రునయనాలతో కన్నటీ వీడ్కోలు పలుకుతుండగా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంతిమయాత్ర సాగింది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ముద్దు కృష్ణమనాయుడు స్వగ్రామమైన వెంకట్రామాపురానికి సమీపంలో ఉన్న ఆయన మామిడి తోటలో గురువారం సాయంత్రం ఆయన పార్థివ దేహానికి దహన క్రియలు నిర్వహించారు.

రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల నాయకులు,కార్యకర్తలు ముద్దు కృష్ణమ అంత్యక్రియలకు విచ్చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి విదేశీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెంకట్రామాపురం చేరుకుని నివాళి అర్పించారు. పార్టీల పరంగానే కాకుండా ముద్దుకృష్ణమ తమ కుటుంబంలోని పెద్దగా భావించామని అమరనాథరెడ్డి అన్నారు.

 పార్టీలకు అతీతంగా...అన్ని పార్టీల నేతలు...

పార్టీలకు అతీతంగా...అన్ని పార్టీల నేతలు...

రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పుల్లారావు, దేవినేని ఉమ, జవహర్‌, సుజయకృష్ణ రంగారావు హాజరై నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ మంత్రులు వెంకట్రామాపురంలోనే ఉన్నారు.

 ఘన నివాళి...కన్నీటి వీడ్కోలు...

ఘన నివాళి...కన్నీటి వీడ్కోలు...

ఎమ్మెల్యేలు జి.శంకర్‌ యాదవ్‌, తలారి ఆదిత్య, సుగుణ, నారాయణస్వామి, ఎమ్మెల్సీలు బుద్దావెంకన్న, యండపల్లి శ్రీనివాసులు, బి.ఎన్‌.రాజసింహులు, మాజీ ఎంపీలు చింతామోహన్‌, దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, సీకే బాబు, లలితకుమారి ముద్దుకృష్ణమకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

  Former AP Minister and TDP MLC Gali Muddukrishnama Naidu Lost Life
   పార్థివదేహాన్ని...ముందుండి మోసిన నేతలు

  పార్థివదేహాన్ని...ముందుండి మోసిన నేతలు

  ముద్దుకృష్ణమ పార్థివదేహాన్ని స్వయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు కరుణా కర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ముందుండి మోశారు. చంద్రగిరి ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఉదయం నుంచి దహనక్రియలు పూర్తయ్యే వరకు ఉన్నారు.

   ప్రభుత్వ లాంఛనాలతో...అంత్యక్రియలు...

  ప్రభుత్వ లాంఛనాలతో...అంత్యక్రియలు...

  రామచంద్రాపురం మండలం వెంకట్రామా పురంలో ముద్దుకృష్ణమనాయుడు పార్థివదేహానికి సాయంత్రం 4.42 గంటలకు వారి వ్యవసాయ భూమిలో ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. పోలీసులు అధికార లాంచనాలతో గౌరవ వందనం చేశారు. హిందూ సాంప్రదాయ పద్ధ తుల్లో చిన్నకుమారుడు జగదీష్‌ చితికి నిప్పంటించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chittoor: Final rites of TDP senior leader Gali Muddu Krishnama Naidu was performed with full state honours. His body was cremated at a farm house in Venkataramapuram village of Ramachandra puram mandal in Chittoor district. Leaders cutting across party lines, TDP workers and common people in large numbers have attended the funeral of Muddu Krishnama Naidu. He passed away at a private hospital in Hyderabad on Tuesday night. Muddu Krishnama Naidu was associated with the TDP from its inception and won as MLA six times.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి