వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా: జయలలితను లాగిన టిడిపి, 'బ్రిటిష్ వారికి పట్టిన గతే బాబుకు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని దివంగత జయలలిత గతంలోనే డిమాండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని దివంగత జయలలిత గతంలోనే డిమాండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం నాడు అన్నారు. విభజన పాపం కాంగ్రెస్, బీజేపీలదే అన్నారు.

పెట్టుబడుల సమావేశం జరుగుతుండగా జగన్ విశాఖలో ఆందోళనలకు సిద్ధం కావడం విడ్డూరమన్నారు. పెట్టుబడులు రావొద్దని ఆయన కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా, న్యాయం చేయాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు 26సార్లు కలిశారన్నారు.

పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!

యువతను రెచ్చగొట్టేలా వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. పోలవరం పనులను కూడా అడ్డుకున్నారని ఆరోపించారు.

మంత్రులు గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడులు కూడా జగన్ పైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారు ఎవరైనా రిపబ్లిక్ డే రోజున ఆందోళన చేస్తారా అని నిలదీశారు.

Gali Muddukrishnama drags Jayalalithaa's name into Special Status issue

అందుకే హౌస్ అరెస్టులు

హోదా పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎప్పుడూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ఉద్యమాలు అణిచివేస్తే బ్రిటిష్ వారికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు.

బీచ్‌లో బికినీ ప్రదర్శనలకు అనుమతిస్తారు కానీ హోదా కోసం పోరాడే వారిని రానివ్వరా అని నిలదీశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామని అఫిడవిట్ కూడా ఇచ్చామన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన హక్కును కాలరాస్తోందన్నారు. ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉధృతం అవుతుందన్నారు.

English summary
Telugudesm Party MLA Gali Muddukrishnama on Thursday dragged late Jayalalithaa's name into Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X