వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఓడిపోవడానికి మీరే కారణం: స్వంత పార్టీ కార్యకర్తలపై గాలి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

పుత్తూరు: 2014 ఎన్నికల్లో తన ఓటమికి టీడీపీ నాయకులు, కార్యకర్తలే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల్లో తాను ఓడిపోకపోతే మంత్రిని అయ్యేవాడినని ముద్దుకృష్ణమనాయుడు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

Lagadapati Rajagopal and BJP Leader Purandeswari Shock to AP CM Nara Chandrababu Naidu | Oneindia

గురువారం పుత్తూరులో నగరి నియోజకవర్గ టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికలను దృష్టిలో అనుసరించాల్సిన వ్యూహంపై గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ నేతలతో చర్చించారు.

అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: టిడిపి ప్లాన్‌తో ప్రత్యర్థులకు షాక్అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: టిడిపి ప్లాన్‌తో ప్రత్యర్థులకు షాక్

ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు నగరి నియోజకవర్గానికి తాను తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు వివరించాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ నేతలకు సూచించారు.

మీ వల్లే నేను ఓడిపోయాను

మీ వల్లే నేను ఓడిపోయాను

2014 ఎన్నికల్లో తన ఓటమికి టీడీపీ నాయకులు, కార్యకర్తలే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.తన సేవలను నాయకులు, కార్యకర్తలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ నేతలు , కార్యకర్తలు ఎన్నికల సమయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఓటమిపాలైనట్టు గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు.

నా గురించి తెలిసే ఎమ్మెల్సీ పదవి

నా గురించి తెలిసే ఎమ్మెల్సీ పదవి

తన గురించి టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడుకు తెలుసునని గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. తన సేవలను ఉపయోగించుకొనేందుకే గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చారని గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు.ఎన్నికల్లో గెలిచి ఉంటే మంత్రిని అయ్యేవాడినని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ మినహ సిఎంలందరిని విమర్శించా

ఎన్టీఆర్ మినహ సిఎంలందరిని విమర్శించా

ఇప్పటి వరకు తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఒక ఎన్టీఆర్‌ను తప్ప మిగతా సీఎంలందరిపైనా అసెంబ్లీలో తొడగొట్టి విమర్శలు చేసిన విషయాన్ని గాలి ముద్దుకృష్ణమనాయుడు గుర్తు చేశారు.నీతి, నిజాయితీగా పనిచేశానని గాలి చెప్పారు.అందుకే సీఎంలు తప్పులు చేస్తే అసెంబ్లీలో విమర్శలు చేశానని గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రస్తావించారు.

60 లక్షలు సీఎం రిలీప్‌ఫండ్ ఇప్పించాను

60 లక్షలు సీఎం రిలీప్‌ఫండ్ ఇప్పించాను

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వెళ్లి పేదలకు న్యాయం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్‌ తీసుకువచ్చిన ఘనత తనదని తెలిపారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబును ఒప్పించి జిల్లాలో 80 మందికి రూ.60 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌ తీసుకొచ్చానని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తరువాత నగరి రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. గృహ నిర్మాణంలో 6200 ఇళ్లు మంజూరు చేసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇంకా మరో వెయ్యి ఇళ్ళ మంజూరుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నారు. ఈ విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు కార్యకర్తలకు వివరించారు.

English summary
Tdp senior leader Gali Muddu Krishnama naidu sensational comments in Nagari Tdp meeting held at Puttur on Thursday.He said that Tdp leaders responsbility for his defeat in Nagari assembly segment in 2014 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X