వైఎస్ కాలంలోనే కట్టారు: బాబు నివాసంపై విమర్శలకు గాలి కౌంటర్
నెల్లూరు/ విజయవాడ: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం కోసం తీసుకున్న భవనాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టారని, ఇప్పుడు చంద్రబాబు నివాసంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు. ఆయన నెల్లూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.
ప్రతి విషయాన్నీ విమర్శించడం సరి కాదని ముద్దుకృష్ణమనాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు హితవు పలికారు. ఎపికి రాజధాని నిర్మించాలా వద్దా, పట్టిసీమ కావాలా వద్దా అనే విషయాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, అక్టోబర్ 2 నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా సాధికారక యాత్ర చేపట్టనున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమని భావించి ఈ యాత్ర చేపడుతున్నట్లు మంత్రి మృణాళిని తెలిపారు.

ఫ్లోరైడ్ గ్రామాలకు మంచినీరు అందించడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. మహిళాసాధికారత , గ్రామీణాభివృద్ధి శాఖపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.
మహిళా సాధికారక యాత్రను అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు మృణాళిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలను చైతన్యపరిచే దిశగా ఆర్థికాభివృద్ధి ఏ విధంగా చేపట్టాలనే విధానంలో ప్రతి మహిళాకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులై జీవితంలో కిందస్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికొచ్చిన వారి యొక్క అనుభవంతో దిక్సూచిగా చూపించే దిశగా చైతన్య పరిచే దిశగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications