కొత్త పార్టీకి ఛాన్స్‌కానీ: ఆనం, కొడుక్కే గల్లా అరుణ ఓటు
హైదరాబాద్: ఈ నెలాఖరులోగా కొత్త పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీని ఏర్పాటు చేస్తారని తాను భావించడం లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు.
తాము సోదరులం తెలుగుదేశం పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాంగ్రెసు పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడమన్నారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తుంటే విభజన జరగదనిపిస్తోందన్నాుర. నెలాఖరులోగా కొత్త పార్టీ రావొచ్చునని, ఎపిఎన్జీవోలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్నారు.

ఏం చేసినా: జయదేవ్‌పై గల్లా అరుణ
తన తనయుడు గల్లా జయదేవ్ ఏం చేసినా తాను స్వాగతిస్తానని మంత్రి గల్లా అరుణ కుమారి వేరుగా చెప్పారు. మరోవైపు గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రిజర్వ్ స్థానం గుంటూరులో ఉన్నందున తాను అక్కడి నుండి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. అమలాపురం మాజీ ఎంపి మహేశ్వర రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సేవ చేసే వారిని కాదని డబ్బున్న వాళ్ళకే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని, వైయస్ కుటుంబంపై అభిమానంతో వెళ్తే నట్టేట ముంచారన్నారు. అమలాపురం కో-ఆర్డినేటర్‌గా ఉన్న తనను తొలగిస్తున్నట్లు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో తన నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.












Click it and Unblock the Notifications