మ‌హేశ్ బాబును రాజ‌కీయాల్లోకి లాగేసిన గ‌ల్లా : ప‌్రిన్స్ స్పందిస్తారా ..ఏం చెబుతారు..!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుంటూరు టిడిపి ఎంపి అభ్య‌ర్ది గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న ప్ర‌చారంలో సినీ హీరో మ‌హేశ్ బాబు ను లాగేసారు. త‌న పై ప్ర‌ధాని మోదీ భ‌య‌పెట్టాల‌ని చూసార‌ని..తాను భ‌య‌ప‌డ‌క‌పోవంతో..హైద‌రాబాద్ లో మ‌హేశ్ బాబు ఆస్తుల పై దాడులు చేసార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల పై మ‌హేశ్ ఎలా స్పందిస్తార‌నేది అటు సిని మా..ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

భ‌య‌పెట్టాలని చూస్తున్నారు...

భ‌య‌పెట్టాలని చూస్తున్నారు...

టిడిపి ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ ఎన్నిక‌ల ప్ర‌చారం లో భాగంగా ప్ర‌ధాని మోదీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేక హోదా చర్చలో భాగంగా పార్లమెంటులో మిస్టర్‌ మోదీ అన్నందుకు ఈడీ దాడులతో భయపెట్టాలని చూశారన్నారు. ఏఉపికి పెండింగ్ హామీలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏపి ప్ర‌యోజ‌నాల కోస‌మే తాను మాట్లాడాన‌ని వివ‌రించారు. ఏపికి ఇప్పటికీ రెవిన్యూ లోటును భ‌ర్తీ చేయ‌లేదని..విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న ఏ హ‌మీని పూర్తి స్తాయిలో అమ‌లు చేయ‌లే ద‌ని చెప్పుకొచ్చారు. నిండు పార్ల‌మెంట్ లో ప్ర‌ధానిని నిల‌దీసినందుకే త‌నను టార్గెట్ చేసార‌న్నారు. అయితే, త‌న సంస్థ‌ల పై కేంద్ర విచార‌ణ సంస్థ‌లు దాడులు చేసాయ‌ని..అయినా, తాను భయపడకపోవడంతో హైదరాబాద్‌లో మహే్‌షబాబు ఆస్తులపైన దాడులు చేశారన్నారు. ఇలాంటి దాడులకు తాను, తన కుటుంబం భయపడదన్నారు.

మ‌హేశ్‌ బాబు జ‌రిగిన దాడులు..

మ‌హేశ్‌ బాబు జ‌రిగిన దాడులు..

గుంటూరు ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ చెప్పినట్లు గా ప్రిన్స్ మ‌హేశ్ బాబు పై ఆస్తుల పై జ‌రిగిన దాడుల పై చ‌ర్చ మొద‌లైం ది. మ‌హేశ్ బాబు ఆస్తుల పై ఆదాయ‌పు పన్ను శాఖాధికారులు దాడులు చేసార‌ని చెబుతున్నా..అవి జిఎస్టీ అధికారులు చేసిన దాడుల‌ని బిజెపి నేత‌లు చెప్పుకొస్తున్నారు. అయితే, కేంద్ర ప్ర‌భుత్వం పై ఉద్దేశ పూర్వ‌కంగా టిడిపి నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ బాబు త‌న పై కేంద్ర సంస్థ ల దాడుల గురించి ఎక్క‌డా ఓపెన్ అవ్వ‌లేదు. ఇప్పుడు మ‌హేశ్ బాబు బావ అయిన గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల తో ఇది రాజ‌కీయ వ్యూహంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌లా..లేక మ‌హేశ్ బాబు అభిమానుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఈ ర‌కంగా వ్యాఖ్యానించారా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది.

ప్రిన్స్ స్పందిస్తారా..

ప్రిన్స్ స్పందిస్తారా..

గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల పై ఇప్పుడు మ‌హేశ్ బాబు స్పందిస్తారా..లేదా..ఒక వేళ స్పందిస్తే ఏ ర‌కంగా రియాక్ట్ అవుతార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ టిడిపికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ ఓపెన్ గా అభ్య‌ర్దించారు. హీరో కృష్ణ సోద‌రుడు ఆది శేష‌గిరి రావు టిడిపి లో చేర‌టం తో పాటుగా టిడిపి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న సైతం కృష్ణ‌..మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ టిడిపి తో ఉంటార‌ని గ‌తంలోనే చెప్పారు. ఇక‌, ఇప్పుడు రాజ‌కీయాల్లో త‌న పేరు ప‌దే ప‌దే ప్ర‌స్తావించటం పై మ‌హేశ్ బాబు ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+