పిఠాపురంలో చివరిరోజు గేమ్ ఛేంజర్ రామ్ చరణ్.. జగన్ కు షాక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు పిఠాపురం వేదికగా రచ్చ కొనసాగుతుంది. ఓవైపు పిఠాపురంలో వైఎస్ జగన్ ప్రచారం చేస్తుంటే మరోవైపు పిఠాపురానికి రామ్ చరణ్ చేరుకున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు వైసిపి వర్సెస్ జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా తన తమ్ముడిని ఆదరించాలని, జనసేన ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రామ్ చరణ్ కు స్వాగతం పలికిన హైపర్ ఆది
ఇక ఇప్పటికే తన బాబాయికి మద్దతు ప్రకటించిన రామ్ చరణ్ నేడు తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీనటుడు రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ, నిర్మాత అల్లు అరవింద్... హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం వచ్చారు, అక్కడ మెగా కుటుంబసభ్యులకు.... హైపర్ ఆది స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకున్నారు.
అడుగడుగునా ఘన స్వాగతం
పిఠాపురంలోని ప్రముఖ శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను చూడడం కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు .అడుగడుగున రామ్ చరణ్ కు అభిమానులు ఘనస్వాగతం తెలిపారు. పిఠాపురంలో రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పోటెత్తిన అభిమాన గణానికి రామ్ చరణ్ అభివాదం చేశారు.

రామ్ చరణ్ రాక .. జగన్ కు షాక్
తన బాబాయ్ తో కలిసి అభిమానులకు అభివాదం చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అభిమానులతో భేటీ అయ్యారని సమాచారం. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం అత్యంత కీలకమని భావిస్తున్న క్రమంలోనే మెగా ఫ్యామిలీ తమ సంపూర్ణ మద్దతును పవన్ కళ్యాణ్ కు ప్రకటించి ఆయన కోసం తమవంతుగా కృషి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు చిరంజీవి కుటుంబ సభ్యులు పిఠాపురం వచ్చి సంఘీభావం ప్రకటించటం జగన్ కు ఇది షాక్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications