విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫాదర్‌తో మద్యం తాగించారు, బ్లూఫిల్స్స్ చూపించారు, వీడియో తీశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ నగరంలో మరో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నగరం కేంద్రంగా రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపిన సెక్స్‌రాకెట్ వ్యవహారాన్ని మరిచిపోక ముందే దాదాపు ఇలాంటి మరో ఉదంతం తెర మీదకు వచ్చింది.

ఓ ప్రముఖ మత బోధకుడు మద్యం సేవించి నీలి చిత్రాలు చూస్తుండగా వీడియోలో చిత్రీకరించి వాటి ద్వారా అతన్ని బెదిరించి కోటిన్నర వరకు దండుకున్న బ్లాక్‌మెయిల్ ముఠా గుట్టు రట్టయింది. ఇప్పటికే అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిన ఫాదర్ ముఠా వేధింపులకు తట్టుకోలేక ఎట్టకేలకు నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించడం ద్వారా టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగి ముఠాకు సూత్రధారి అయిన న్యాయవాదితోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి -గుణదలలోని ఓ చర్చి ఫాదర్ కొంతకాలం క్రితం నుంచి పటమటలోని సొసైటీలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఈ విషయం అతని వద్ద పని చేసే వ్యక్తికి తెలుసు. ఫాదర్ వద్ద భారీగా డబ్బు ఉందని గ్రహించిన సదరు వ్యక్తి తన పరివారంతో కలిసి ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని వ్యూహరచన చేస్తూ వచ్చాడు. దీనిలో భాగంగా తనకు తెలిసిన ఓ న్యాయవాది నేతృత్వంలో మరికొందరితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.

gang arrested for blackmailing a father

ఫాదర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశారు. దీనిలో భాగంగా పటమటలో ఓ చోట గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ రోజు మందు పార్టీ ఏర్పాటు చేసి ఫాదర్‌ను ఆహ్వానించగా ఆయన హాజరయ్యారు. మద్యం మత్తులో ఫాదర్‌కు నీలి చిత్రాలు చూపించడంతో ఆయన వాటితో లీనమై ఉన్న సమయంలో అతనికి తెలీకుండా ఈముఠా వీడియోలో చిత్రీకరించింది.

ఆ తర్వాత ఆ దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లో ఉంచి దాని సాయంతో ఫాదర్ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుండా వాటిని బయటపెడతామని బెదిరిస్తూ 2015 నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కోటి 34లక్షల రూపాయల వరకు ఫాదర్ నుంచి ఈ ముఠా దండుకుంది. అయితే అంతటితో ఆగని బ్లాక్‌మెయిల్ ముఠా వేధింపులు రోజురోజుకు శృతి మించుతూ మరో రెండు కోట్లు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

వేధింపులు తట్టుకోలేని ఫాదర్ ఇక చేసేదేమీ లేక నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో సీపి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జరిగిన అన్ని విషయాలను ఫాదర్ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.

టాస్క్‌ఫోర్స్ ఏసిపి ప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాస్ బృందం బ్లాక్ మెయిల్ ముఠాను గుర్తించి ఓ పదిమంది వరకు అదుపులోకి తీసుకుంది. అయితే కీలక సూత్రధారి అయిన న్యాయవాది మాత్రం తెలివిగా పోలీసులకు ఖాళీ పెన్‌డ్రైవ్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీదట న్యాయవాదితోపాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

English summary
A gang has been arrested for blackmailing a church father at Vijayawada of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X