మరో దారుణం: తూర్పుగోదావరిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ యత్నం..
కాకినాడ: దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. తొండంగి సమీపంలోని ఓ గ్రామంలో 17ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు.
వివరాల్లోకి వెళ్తే.. తొండంగి పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఒక హోటల్ ఉంది. బుధవారం రాత్రి 10గం. సమయంలో హోటల్ మూసి ఇంటికెళ్లేందుకు సిద్దమవుతుండగా.. కత్తిపూడి ఎంపీటీసీ భర్త కంచిపల్లి శ్రీనివాస్, రవి, శ్రావణ్, సత్యనారాయణ
అనే నలుగురు మద్యం సేవించి అక్కడికి వచ్చారు.

ఓవైపు షాపు మూసివేస్తుంటే.. వీరు నలుగురు తమకు 'టీ' కావాలంటూ
వారితో వాగ్వాదానికి దిగారు. దుకాణం మూసివేశామని వారు చెప్పడంతో వారిని బండబూతులు తిట్టారు. ఇదే క్రమంలో దుకాణం యజమానురాలైన మహిళ చెల్లెల్ని ఆ నలుగురు మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశారు. దీంతో ఆమె అక్క కేకలు వేయగా.. తోటమాలి పరుగెత్తుకొచ్చాడు.
ఇంతలో స్థానికులు కూడా అక్కడికి రావడంతో నిందితులు తమ కారును అక్కడే వదిలిపారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications