భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం: బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్..

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దారుణం జరిగింది. ఓ గిరిజన బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలిని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన గిరిజన బాలికగా గుర్తించారు. దమ్మపేట మండలంలోని రాచూరుపల్లిలో ఆమె స్నేహితురాలు ఉండటంతో.. ఈ నెల 20న ఆమె ఇక్కడికి వచ్చింది.

gang rape on tribal girl in bhadradri kothagudem

స్నేహితురాలితో కలిసి ఈ నెల 22వ తేదీ ఉదయం గ్రామంలో జరిగిన ఓ వేడుకకు కూడా హాజరైంది. అనంతరం వారిద్దరూ జామాయిల్‌ తోటల వైపు వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఇద్దరిపై అత్యాచారం జరపబోగా.. బాలిక స్నేహితురాలు ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది.

Recommended Video

    దళిత బాలికపై రేప్.. ఆపై హత్య !

    అక్కడే చిక్కుకుపోయిన బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఘటన అనంతరం స్వగ్రామానికి వెళ్లిపోయిన బాలిక.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+