అఖిల-బాబును దెబ్బకొట్టాలని ప్లాన్: బరిలో రాజగోపాల్, జగన్‌కు రివర్స్!, గంగుల క్లారిటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో గంగుల ప్రతాప్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి, భూమా కుటుంబానికి చెక్ చెప్పాలని భావించిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్.

కేవలం టిక్కెట్ కోసమే పార్టీలో చేరే గంగులను అందలం ఎక్కించడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. తొలుత జగన్.. టిడిపి శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తే భూమా ఫ్యామిలీలో ఒకరికి ఇవ్వాలని, భూమా కుటుంబానికి టిడిపి టిక్కెట్ ఇస్తే శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని భావించారు.

ట్విస్ట్.. నంద్యాలపై సుజన ఫోకస్: శిల్పా ధీమా, అఖిలప్రియ యూటర్న్?

కానీ చంద్రబాబు అడ్డుకట్ట వేశారు. భూమా కుటుంబంతో పాటు శిల్పా మోహన్ రెడ్డి చేజారకుండా టిడిపి అధినేత చక్రం తిప్పారు. దీంతో వైసిపి గంగుల ప్రతాప్ రెడ్డిని తెరపైకి తీసుకు వచ్చింది. 

గంగులకు టిక్కెట్ ఇస్తే ఈజీ కాదు

గంగులకు టిక్కెట్ ఇస్తే ఈజీ కాదు

గంగులకు టిక్కెట్ ఇస్తే వైసిపికి అంత ఈజీ కాదని తెలుస్తోంది. అప్పటికే నంద్యాలకు వైసిపి ఇంచార్జ్ ఉన్నారు. ఆయనకు టిక్కెట్ వస్తుందని తొలుత భావించారు.

కానీ జగన్ శిల్పా మోహన్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డిల పేర్లు పరిశీలిస్తుండటం ఆయన వర్గానికి అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్‌ను కలిసి పలువురు నియోజకవర్గ నేతలు తమ ఆవేదనను తెలియజేయనున్నారని తెలుస్తోంది.

కొత్త వారికి టిక్కెట్ ఎలా ఇస్తారు?

కొత్త వారికి టిక్కెట్ ఎలా ఇస్తారు?

భూమా టిడిపిలోకి వెళ్లినప్పటి నుంచి ఉన్న నేతను కాదని కొత్త వారికి టిక్కెట్ ఇవ్వడం సరికాదని వారు జగన్‌కు చెప్పనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు గంగులకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని, ఇప్పుడు మళ్లీ ఈయనకు టిక్కెట్ ఇవ్వడం సరికాదని చెప్పనున్నారని తెలుస్తోంది. ఒకవేల శిల్పా మోహన్ రెడ్డి చేరినా ఇలా షాక్ తగిలేదని కొందరు అంటున్నారు.

తన వైపు నుంచి గంగుల క్లారిటీ

తన వైపు నుంచి గంగుల క్లారిటీ

ఇదిలా ఉండగా, ఇటీవల మీడియాతో మాట్లాడిన గంగుల ప్రతాప్ రెడ్డి.. జగన్ ఆహ్వానిస్తే వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే గంగుల మాటలకు వైసిపి ఎలా స్పందించిందో మాత్రం క్లారిటీ లేదు. దీనిపై గంగుల ప్రతాప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

జగన్ రమ్మన్నారని..

జగన్ రమ్మన్నారని..

జగన్ తనకు ఫోన్ చేశారని, వైయస్ సమకాలీకుడైన తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని, వైసిపితో కలిసి నంద్యాలలో మార్గదర్శకత్వం వహించాల్సిందిగా రోరారని, జగన్‌తో కలిసి పని చేసేందుకు తనకు ఇబ్బంది లేదని గంగుల ప్రతాప్ రెడ్డి చెప్పారు. జగన్ వయస్సులో చిన్నవాడే అయినా, అతడి ఆలోచన సరళి బాగుందన్నారు.

జగన్ నుంచి రావాలి

జగన్ నుంచి రావాలి

ప్రజా సమస్యలపై తండ్రిలాగే స్పందిస్తున్నారని గంగుల కితాబిచ్చారు. తాను చిన్నప్పటి నుంచి జగన్‌ను చూస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయాలనుకున్నానని, కానీ జగన్ ఫోన్ చేసి ఉప ఎన్నికల్లో నిలబడారని కోరారని చెప్పారు. అయితే దీనిపై జగన్ లేదా వైసిపి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

టిక్కెట్ ఆశించిన రాజగోపాల్ రెడ్డి

టిక్కెట్ ఆశించిన రాజగోపాల్ రెడ్డి

అయితే నంద్యాల ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి, ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. తనకు జగన్ మాటిచ్చారని, తానే ఎన్నికల బరిలో ఉంటానని రాజగోపాల్ అంటున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nandyal YSRCP leaders unhappy with party chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...