భారీ గంజాయి కుంభకోణం: నిందితుడి అరెస్టు, కాల్ డేటాలో 'మహా'మహులు
విజయవాడ: గంజాయి కుంభకోణం కేసులో కీలక నిందితుడు పోలీసులకు చిక్కాడు. కంచనపల్లికి చెందిన అవుకు శివశంకర్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతని కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లు బయటపడినట్లు సమాచారం.

మహారాష్ట్రకు శివశంకర్ రెడ్డి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ఈ వైనం వెనక పెద్ద కుంభకోణం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా స్మగ్లర్ల ద్వారా ముంబై వ్యాపారులకు శివశంకర్ రెడ్డి గంజాయి సరఫరా చేస్తున్నారు.
గంజాయి కుంభకోణంలో విజయవాడ, హైదరాబాదులకు చెందిన ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి కుంభకోణం గుట్టు విప్పేందుకు పోలీసులు శివశంకర్ రెడ్డిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications