నియంతృత్వ ధోరణి: టి సర్కారుపై గంటా ఫైర్, ఫాస్ట్‌పై అభినందన
హైదరాబాద్/తిరుపతి: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నిప్పులు చెరిగారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ, నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ సర్కారు కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించారు.
ఆచరణ సాధ్యం కానీ హామీలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును దుయ్యబట్టారు. ఫాస్ట్ పథకంపై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గడం అభినందనీయమని గంటా శ్రీనివాస రావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఖాతాలను ఫ్రీజ్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 371 డిఆర్టికల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ఎలా వెళ్లారో అలాగే తిరిగొస్తారు: జానారెడ్డి
నల్గొండ: వలసలను ప్రోత్సహిస్తూ ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న సిఎం కేసీఆర్‌కు పతనం తప్పదని సిఎల్పీ నేత కె. జానారెడ్డి అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారు.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి రావడం తథ్యమని అన్నారు.












Click it and Unblock the Notifications