దొడ్డదారి, కిరణ్‌ను మార్చి..: అధిష్టానంపై గంటా నిప్పులు

బిల్లు అసెంబ్లీకి వస్తే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారని చెప్పారు. ఏదో ఒక స్థాయిలో విభజన ప్రక్రియ ఆగుతుందని ఆకాంక్షించారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని తాము భావించామని కానీ అలా జరగలేదన్నారు. ఇంత వరకు ఆంటోనీ కమిటి ఎందుకు పర్యటించలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఏది చెబితే అందుకు వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. దిగ్విజయ్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు ఏదీ నెరవేరలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి అధిష్టానం మరో తప్పు చేస్తుందనుకోవడం లేదన్నారు.
రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రాంతంలో అందరూ వ్యతిరేకిస్తున్నారని మరో మంత్రి పార్థసారథి వేరుగా అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు కాదంటే ఈ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications