వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ నగరపాలక సంస్ద ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం వద్ద నాలుగు ప్రతిపాదనలు ఉన్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పోర్ట్ గెస్ట్ హౌస్‌లో ఎస్‌. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విశాఖపట్నం జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలం భవానీలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత జీవిఎంసీ పరిధిలోని 72 వార్డులను యదాతధంగా ఉంచడం, జీవీఎంపీ పరిధిలోకి అనకాపల్లిని కలపడం, జీవీఎంసీ - అనకాపల్లి -భీమిలి మూడు ప్రాంతాలను కలపడం, జీవీఎంసీ - అనకాపల్లి- భీమిలి- ఐదు పంచాయితీలను కలిపి ఎన్నికలు నిర్వహించడం అన్న ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. అలాగే ప్రత్యక్ష ఎన్నికలా? లేదా పరోక్ష ఎన్నికలా అన్నది కూడా ఇంకా నిర్ణయించలేదన్నారు.

ఇక విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ది, విస్తరణకు సంబంధించి ఈ నెల 29న జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సుకు రానున్నట్లు తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని, ఆయన చేతులమీదుగా రుషికొండలో నిర్మించిన ఇంకుబేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇంకుబేషన్‌ కేంద్రంలో విద్యార్థుల పరిశోధనలకు స్ర్టీట్‌ విలేజ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. కొచ్చిన్‌లోని స్ట్రీట్ విలేజ్‌ విజయవంతమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు పారిశామ్రిక సంస్థలకు కేటాయించిన భూముల వినియోగంపై సమీక్షించనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఈ నెల 21న ఏపీఐఐసీ చైర్మన్‌ కృష్ణయ్య నగరానికి రానున్నట్లు తెలిపారు. సెజ్‌లు, నాన్‌సెజ్‌లలో భూములు తీసుకున్న సంస్థలు, ఒప్పందం సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

 విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

కంపెనీలు కనీసం పది శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బ్రాండెక్స్‌లో 40 వేలకు 3,280 మంది, ఫార్మాసిటీలో 20 వేలకు 10,300 మందికి, ఐటీ సెజ్‌లలో 18,300కి 5,745 మందికి ఉపాధి లభించిందన్నారు. ఫార్మాసిటీలో స్థానికులకు 2,195 మందికే ఉపాధి ఇచ్చారన్నారు.

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

భూములు కేటాయించింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికో, ఖాళీగా వుంచడానికో కాదని మంత్రి అన్నారు. నైపుణ్యం లేనందునే స్థానికులకు ఉపాధి ఇవ్వలేకపోతున్నామని పారిశ్రామిక సంస్థలు చెబుతున్న నేపథ్యంలో విశాఖలో శిక్షణ కేంద్రం నెలకొల్పుతామన్నారు.

 విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఉక్కు కర్మాగారంలో దీనిని ఏర్పాటుచేస్తామన్నారు. ఏటా వేలాది మందికి ఉపాధి రంగాలపై శిక్షణ ఇస్తున్న బెంగళూరుకు చెందిన సుధా ఫౌండేషన్‌ వంటి సంస్థ సహకారంతో ఈ శిక్షణ కేంద్రం నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు.

 విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

విశాఖ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలపై గంటా

హైదరాబాద్‌లో మాదిరిగా విశాఖలో హైటెక్స్‌ నిర్మించనున్నామన్నారు. నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధులతో దీనిపై చర్చించామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన హైటెక్స్‌కు మధురవాడలో 250 ఎకరాలను గుర్తించనున్నట్టు చెప్పారు.

English summary
Andhra Pradesh Minister Ganta Srinivas Rao saying National IT Conference conducted on 29th September in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X