• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ తో గంటా శ్రీనివాసరావు భేటీ - వ్యూహం సిద్దం..!!?

|
Google Oneindia TeluguNews

విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే.. విశాఖ కీలక నేత గంటా శ్రీనివాస రావు జనసేనానితో భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలో ప్రధానితో సమావేశం అయ్యేందుకు విశాఖ వచ్చిన జనసేనాని స్థానికంగా నోవాటెల్ హోటల్ లో బస చేసారు. అక్కడే అదే హోటల్ లో కొందరు బీజేపీ ముఖ్య నేతలు దిగారు. ప్రధాని పర్యటన..పవన్ కల్యాణ్ టూర్ నేపథ్యంలో టీడీపీ నేతలంతా మౌనంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో నోవాటెల్ హోటల్ లో మాజీ మంత్రి గంటా ప్రత్యక్షమయ్యారు.

కొద్ది రోజుల క్రితం గాద్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో చిరంజీవితో గంటా సమావేశమయ్యారు. ఆ సమయంలో చిరంజీవి తాను పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో మెగాస్టార్ తో గంటా భేటీ తరువాత ..ఇక గంటా జనసేనకు దగ్గరవుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసారు. కానీ, ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. ప్రజారాజ్యం సమయం నుంచి మెగా బ్రదర్స్ తో గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 Ganta Srinivasa Rao met Janasena Chief Pawan Kalyan at Vizag As per reports

అయితే, ఆ తరువాతి కాలంలో చిరంజీవి - గంటా మధ్య సత్సంబంధాలు కొనసాగుతన్నా.. పవన్ తో కొంత గ్యాప్ వచ్చింది. కానీ, ఇప్పుడు టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే చర్చలు.. ప్రధానితో పవన్ భేటీ ద్వారా గంటా వేగంగా తన రాజకీయం మొదలు పెట్టారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం వైసీపీ అమలు చేస్తోంది. విశాఖ నగర ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు గంటా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో అనుకూలంగానూ ముందుకు రాలేదు. దీంతో పాటుగా.. విశాఖ కేంద్రంగా గంటా ప్రతీ ఎన్నికల్లో తన టీంకు టిక్కెట్లు ఇప్పటించుకోవటం దగ్గర నుంచి గెలిపించుకోవటం వరకు బాధ్యతలు తీసుకుంటారు.

ఇప్పుడు పవన్ బస చేసిన హోటల్ వద్ద ప్రత్యక్షమైన గంటా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ను కలిసేందుకు వచ్చారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. కానీ, పవన్ కల్యాణ్ తో మర్యాద పూర్వక భేటీ జరిగిందని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ ద్వారా భవిష్యత్ కోసం డోర్లు ఓపెన్ చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీ - జనసేన పొత్తు ఉన్నా తన టీంకు ఇబ్బంది లేకుండా చేసుకోవటమే గంటా లక్ష్యంగా తెలుస్తోంది. అదే సమయంలో.. పొత్తు లేకపోతే గంటా టీడీపీలోనే కొనసాగుతారా లేక.. చాలాకాలంగా ప్రచారం సాగుతున్నట్లుగా పార్టీ మార్పు పైన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

English summary
Ex Minister Ganta Srinivasa Rao met Janasena Chief Pawan Kalyan iat Vizag As per reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X