జగన్ వి ఊసరవెల్లి వ్యాఖ్యలు, చంద్రబాబును అరెస్టు చేయలేరని తెలుసు-గంటా కామెంట్స్...
ఏపీలో సీఎం జగన్ నిన్న రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించగా, భోగాపురం ఎయిర్ పోర్టు శంఖుస్ధాపన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రెండవది. ఈ రెండు అంశాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్, ఆధాని డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్ళీ శంఖుస్థాపన చేశారంటూ గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.అధికారంలోకి వచ్చిన 4ఏళ్ల తర్వాత రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేశారన్నారు. ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలో మాటలకు పొంతన లేదని గంటా ఆరోపించారు. డిఫెన్స్, సివిల్ కి తేడా జగన్ కి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయనకు కనీస అవగాహన లేదనేది తెలుస్తుందన్నారు. ఊసరవెల్లి కూడా జగన్ లా రంగులు మార్చలేదని గంటా తెలిపారు.

వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు పెట్టి రెండు నెలలు అయ్యిందని, ఇప్పటివరకు రివ్యూ నిర్వహించ లేదని వైఎస్ జగన్ పై గంటా మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చెయ్యగలరా అంటూ నిన్న చేసిన వ్యాఖ్యల ఆధారంగా జగన్ ను ప్రశ్నించారు. దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేశారని, ఋషికొండ ను ధ్వంసం చేశారని గంటా ఆరోపించారు. రాష్ట్రంలో రామోజీరావు, ఆదిరెడ్డి లే చిట్ ఫండ్స్ కంపెనీలు నడుపుతున్నారా..
మిగతా వారు నడుపుతోంది కన్పించడం లేదా అని గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే అన్నారు.
ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని గంటా తెలిపారు. సిట్ కు సంబంధించి మీకు అనుకూలంగా వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబు అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారని, అది మీ వల్ల కాదనేది అందరికి తెలుసని గంటా పేర్కొన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు అభివృద్ధి గురించి గతంలో కేటీఆర్ మెచ్చుకున్నారని గంటా గుర్తుచేశారు.ఇపుడు అదే విషయాన్ని రజనీకాంత్ చెప్పారని, చంద్రబాబు ని మెచ్చుకోవడం తట్టుకోలేక వైసీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని గంటా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారయ్యిందని, దేశంలో ఎక్కడా దొరికినా ఏపీ మూలాలు బయటకు వస్తున్నాయని గంటా ఆరోపించారు.












Click it and Unblock the Notifications