వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఏపీలో అధికార వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని వైసీపీ కూడా ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు.

విశాఖపట్నంలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణలు టీడీపీలో చేరుతున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్ వ్యవహారశైలి, ఆయన వ్యక్తిత్వం నచ్చకే వారంతా టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తనను ఎవరో ఏదో అన్నారని... వాళ్లకు కౌంటర్ ఇచ్చే శైలి తనది కాదని అన్నారు గంటా శ్రీనివాసరావు.

Ganta Srinivasa Rao slams ysrcp and ys jagan compares with brs in telangana

రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని గంటా చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలను తాను బెదిరిస్తున్నానని అవంతి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ మారుతారనేది ఒక భ్రమ అని చెప్పారు. అలాంటి పనులు వైసీపీనే చేస్తుందన్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చకే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీలో చేరారని తెలిపారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి చేరకలు పెరిగాయి. వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నాయుడు బాబు, వైసీపీ కీలక నేత పంగ బావాజీనాయుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లి, బొంతలపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో బత్తలపల్లి పంచాయతీలో 100 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారందరికి కందికుంట వెంకటప్రసాద్‌ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరులో సుమారు వందమంది వార్డు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి నారాయణ సమక్షంలో వారంతా పార్టీ కండువా కప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+