వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా శ్రీనివాసరావు రాజకీయమే వేరబ్బా!

|
Google Oneindia TeluguNews

గంటా శ్రీనివాసరావు రాజకీయమే వేరబ్బా అనిపిస్తుంటుంది ఆయన రాజకీయ ఎత్తులు, వ్యూహాలు పరిశీలించినప్పుడు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన గంటా ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడా వార్తల్లో నిలవలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆయన స్పీకర్ కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది.

అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ట్వీట్

అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ట్వీట్


తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనేది సీఐడీ ఆరోపణ. పోలీసులు గోడ దూకి వెళ్లి మరీ అయ్యన్నను అరెస్ట్ చేశారు. పార్టీలో గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్నపాత్రుడి మధ్య విభేదాలున్నాయి. కానీ అకస్మాత్తుగా గంటా వార్తల్లోకి వచ్చారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ ను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ''సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను ఖండిస్తున్నాను.. కనీస ప్రోటోకాల్స్ లేకుండా అరెస్ట్ చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.. బేషరతుగా అయ్యన్న ను విడుదల చేయాలి". అని రాసుకొచ్చారు.

రాజకీయ తెరపైకి వచ్చిన గంటా

రాజకీయ తెరపైకి వచ్చిన గంటా


గంటా శ్రీనివాసరావు భీమిలో పోటీచేసినా, అనకాపల్లిలో పోటీచేసినా, విశాఖ దక్షిణంలో పోటీచేసినా ఆయన ఎలా విజయం సాధిస్తుంటారనేది రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యే ప్రశ్నార్థకం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఇలా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అసలు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంకానీ, అసెంబ్లీకి హాజరవడంకానీ బహు తక్కువ. అలాంటిది ఎన్నికలు ఏడాదిన్నర సమయం ఉందనగా, అయ్యన్న పాత్రుడి అరెస్ట్ పై స్పందించి తెరపైకి వచ్చారు.

ఉంటారా? మారతారా?

ఉంటారా? మారతారా?


రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫునే పోటీచేస్తారా? పార్టీ మారతారా? అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన కూడా దీనిపై స్పష్టతనివ్వడంలేదు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదురుదాడి ఉంటే తట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో ఇన్నాళ్లు నెమ్మదించారని, త్వరలోనే రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. విశాఖపట్నం దక్షిణంలో పోటీచేయడం అసాధ్యం. వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అనే విషయమై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.

English summary
Ganta Srinivasa Rao's politics seems to be different when his political heights and strategies are examined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X