Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!!

ప్రముఖ ప్రవచన కర్త గరకపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. తాజాగా గరికపాటి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. గరికపాటి టీం స్పందించింది. ఆ వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చింది.

ప్రవచన కర్త గరికపాటి తాజాగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పైన "బళ్లలో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైంది. చదువు మిధ్యాహ్న మైంది. చదువు ఎవడికి అక్కర్లే... భోజనంలో గుడ్డెట్టారా... గాడిద గుడ్డెట్టారా? అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంది? బుద్దుందా లేదా? చదివితే చదువుకోవాలి? లేకపోతే వెళ్లిపొమ్మని చెప్పు. కోడిగుడ్ల కోసం వస్తావా నీవు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టార్లు వాళ్ల ఖర్మ కాలి.

Garikapati Narasimha Rao targets school children availing mid-day meals leads to new controversy

చదువు చెప్పక్కర్లా.. ఎన్ని గుడ్లు వెళ్లాయి? ఎన్ని గుడ్లు పేలాయి? ఎన్ని గుడ్లు మధ్యలో పోయాయి? ఎన్ని గుడ్లు ఈ మాస్టారు తినేశారు? ఇక వాళ్లు చదువెందుకు చెబుతారండీ? అసలు పిల్లలకు భోజనం పెట్టడమేంటి? వాళ్ల భోజనాలు వాళ్లను తెచ్చుకోమనండి.. లేకపోతే మానేయమనండి! పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫాం ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా...? శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు! విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా.. అవసరమా! చదువు రావట్లేదు ఎవరికి? భోజనాలే వస్తున్నాయి..." అంటూ గరికపాటి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!

వివాదం వేళ గరికపాటి టీం క్లారిటీ

ఈ వ్యాఖ్యల పైన అనేక మంది స్పందించారు. బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పైన ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో గరికపాటి నరసింహారావు బృందం వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమేనని, ఆయన చేసిన పూర్తి ప్రసంగాన్ని వినకుండా నిర్ణయానికి రావడం సరి కాదని చెబుతున్నారు.

గరికపాటి ఉద్దేశం మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా పేద విద్యార్థులను కించపరచడం కాదని, ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారని స్పష్టం చేశారు. ఆయన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు వెల్లడించారు. దీంతో.. ఇప్పుడు గరికపాటి చేసిన వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా.. లేక, కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+