ఏపీ రాష్ట్రం కాదు కులాల కుంపటి; అమరావతి రైతుల మహా పాదయాత్ర వద్ద గరుడ శివాజీ సంచలనం
ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో ఆపరేషన్ గరుడ అనే కాన్సెప్టుతో సంచలనం సృష్టించిన నటుడు శివాజీ, ప్రత్యేక హోదా అంశాన్ని అప్పట్లో బలంగా వినిపించి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక కేంద్రంలోని బీజేపీపై కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలో కొన్ని పార్టీలతో కలిసి కుట్రలు చేస్తుందని, గత టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు శ్రీకారం చుట్టిందని ఆయన సంచలనం సృష్టించారు. ఇక శివాజీ టీడీపీకి మద్దతు ఇస్తున్న తీరు చూసి ఆయన టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక ఛానల్ కు సంబంధించిన కేసులో అజ్ఞాతంలోకి వెళ్లి సైలెంట్ అయిన శివాజీ ఇప్పుడు మళ్లీ అమరావతి రైతుల మహా పాదయాత్రలో ప్రత్యక్షం అయ్యాడు. ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆసక్తిని రేకెత్తించారు.

పాదయాత్ర చేస్తున్న రైతులకు శివాజీ సంఘీభావం .. ఏపీపై షాకింగ్ వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ అనేది రాష్ట్రం కాదని, కులాల కుంపటి అని నటుడు శివాజీ పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ మరోమారు తన గళాన్ని వినిపించారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడం లేదని వాపోయారు. కులాల కుంపట్ల మధ్య ఏపీ ఏమి అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. మనమంతా బాగా కలుషితమయ్యామని పేర్కొన శివాజీ, దీని నుండి బయట పడితే తప్ప భవిష్యత్తు తరం బాగుపడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే : నటుడు శివాజీ
అమరావతిని ఏదో చేద్దాం అనుకుంటే సాధ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని నటుడు శివాజీ తేల్చిచెప్పారు. ప్రజలు సినిమాలో సీన్లు గుర్తుపెట్టుకున్నంత బాగా, సమాజం లో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవడం లేదని, నేను నా కుటుంబం అనే స్వార్థంతోనే బ్రతుకుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. నేను నా కుటుంబం అనుకునే వారందరి పాదాలకు దండాలని నటుడు శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు. రాజధాని అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న వారు చేశారని, కానీ ఇంకొకరు ఇంకో మాట చెబుతున్నారంటూ వైసీపీని టార్గెట్ చేశారు.

రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుదరదు
అమరావతి కోసం చేస్తున్న పోరాటంలో మానవ మృగాలను దాటుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. మీడియా కూడా వర్గాలుగా విడిపోయింది అని పేర్కొన్న శివాజీ రాజకీయ వ్యవస్థ పై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ వల్ల అంబానీ వంటి వారు కూడా దేశం వదిలి వెళ్లాలనుకుంటున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ. రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుదరదు అని పేర్కొన్న శివాజీ బొత్స సత్యన్నారాయణ, కొడాలి నాని వంటి మంత్రులు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు అంటూ వారిని టార్గెట్ చేశారు.

నేతల పాపం ఊరికే పోదు.. కచ్చితంగా వెంటాడి తీరుతుంది : శివాజీ
నేతల పాపం ఊరికే పోదు అని, కచ్చితంగా వెంటాడి తీరుతుందని శివాజీ తేల్చిచెప్పారు ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచిన ఓటరు ఆత్మసాక్షికే ఓటేస్తారని, ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో అర్థమైందని నటుడు శివాజీ స్పష్టం చేశారు. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలతో, అమరావతి పోరాటానికి మద్దతు తెలిపిన శివాజీ మళ్లీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఏపీ రాజకీయాలపై మళ్ళీ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications