విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంటులో గ్యాస్ లీక్: ఉద్యోగుల పరుగు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంటులోని ఎస్ఎంఎస్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ లీక్ అయింది. దీంతో ప్లాంటులోని సిబ్బంది, ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎస్ఎంఎస్ విభాగంలో గ్యాస్ లీకేజీని అరికట్టారు.

స్టీల్ మెల్డ్‌లో వాటర్ లెవల్స్ తగ్గడం, నాలుగు రోజులుగా ప్లాంటులో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్లే ఈ లీక్ జరిగినట్లు ఉద్యోగులు చెప్పారు. గ్యాస్ బయటికి లీకైతే వేలాది మంది ప్రజలకు హాని జరిగి ఉండేదని వారు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు విడుదలయ్యేవని చెప్పారు.

Gas leaked in Visakha steel plant

ప్లాంటుకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు ఉద్యోగులు తెలిపారు. విద్యుత్ సరఫరా లేనికారణంగానే గ్యాస్ లీకైనట్లు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్లాంటుకు వేల కోట్ల నష్టం జరుగుతోందని వారన్నారు. కాగా, గ్యాస్ లీకైనట్లు వస్తున్నట్లు వదంతులు నమ్మవద్దని ప్లాంటు జనరల్ మేనేజర్ పేర్కొన్నారు.

ఇంటిపైకప్పుపై గోడకూలి నలుగురికి గాయాలు

పద్నాలుగో వార్డు పరిధి నక్కవానిపాలెం అరవై అడుగుల రోడ్డు పక్కన ఒక పెంకుటింటిపై పక్కింటి మేడపై అంతస్తు గోడలు, కిటికీలు పడిపోవడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అందులో రోజుల పసికందుకు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంది.

పసికందును ఏ ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్స అందలేదని వాపోయారు. ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా పై అంతస్తులో ఒంటి ఇటికి గోడతో ఇళ్లు నిర్మించడంతో ఇల్లు కూలిపోయిందని క్షతగాత్రుడు అప్పలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Gas leaked in Visakha steel plant in Visakhaptnam on Wednesday moring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X