విషాదం: గ్యాస్ పైప్‌లైన్ పేలి 15 మంది సజీవదహనం

మంటలు కిలోమీటర్ ఎత్తులో భారీగా ఎగసి పడుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఆలస్యంగా రావడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంటలకు సమీపంలో ఉన్న ఇళ్లు, దుకాణాలు, కొబ్బరి తోటలు కూడా దగ్ధమయ్యాయి. 1994లో ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు 250 మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. బ్లోఅవుట్ మాదిరిగా భారీ శబ్దాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాంతో పరుగులు తీశారు. బ్లోఅవుట్ మాదిరిగా పెద్ద శబ్దాలు వచ్చాయి.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఇంట్లో నివసిస్తున్నవారంతా సజీవ దహమయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. 2010 రాజమండ్రి రిఫైనరీలో ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప సంఘటనా స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సంఘటనపై విచారణ జరిపిస్తామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేట్టినట్లు గెయిల్ చైర్మన్ త్రిపాఠీ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియదని ఆయన అన్నారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications