Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గౌతమ్ రెడ్డి మరణానికి ముందు - భార్యతో చివరి మాట : ఆ 27 నిమిషాల్లో ఏం జరిగింది...!!

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు షాకింగ్ న్యూస్ గా మారింది. పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. గౌతమ్ కుటుంబ సభ్యుల కన్నీటిని ఆపటం ఎవరి వల్లా కావటం లేదు. సీఎం జగన్ తో సహా మంత్రులు..పార్టీ నేతలు...తెలంగాణ మంత్రులు గౌతమ్ కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించారు. అయితే, అంత యాక్టివ్ గా ఉండే గౌతమ్ మరణం వెనుక కారణం ఏంటి..అసలు మరణానికి ముందు ఏం జరిగిందో చూస్తూ... ఎవరికైనా ఆవేదన కలుగుతుంది.

కూర్చున్న మంత్రి ఒక్క సారిగా

కూర్చున్న మంత్రి ఒక్క సారిగా

వారం రోజుల దుబాయ్ పర్యటన తరువాత గౌతమ్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రంగా ఒక నిశ్చితార్ధం కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9.45 కి ఇంటికి వచ్చి నిద్ర పోయారు. ఇక, ఈ రోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన గౌతమ్ తన ఫోన్ చూసుకున్నారు. తరువాత 07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి కాసేపు ఫోన్ తోనే గడిపారు. 07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. 07:15గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి బాధ పడుతూ కనిపించారు. 7:16 గం.లకు కంగారు పడి మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరవంటంతో సిబ్బంది మొత్తం అక్కడకు వచ్చారు.

నొప్పి పెడుతుంది కీర్తి అంటూ చివరి మాట

నొప్పి పెడుతుంది కీర్తి అంటూ చివరి మాట


07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు..గుండె నొప్పిగా అనుమానించారు. వెంటనే.. 07:20 గం.లకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారు. 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. దీంతో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి ఆస్పత్రికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 07:22 "నొప్పి పెడుతుంది కీర్తి" అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. 07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చారు.

Recommended Video

    Mekapati Goutham Reddy ప్రస్థానం.. గౌతమ్ రెడ్డి ఇమేజ్ ప్రత్యేకం|Andhra Pradesh | Oneindia Telugu
    ఆస్పత్రికి తీసుకెళ్లినా..దక్కని ప్రాణం

    ఆస్పత్రికి తీసుకెళ్లినా..దక్కని ప్రాణం


    08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు.. 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, మంత్రి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారని..దాని కారణంగానే గుండె పోటు వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మేకపాటి కుటుంబ సభ్యులు ఖండించారు. కేవలం 27 నిమిషాల్లోనే మొత్తం మేకపాటికి గుండె పోటు రావటం... ఆస్పత్రికి తీసుకెళ్లటం.. ప్రాణాలు కోల్పోవటం జరిగింది. చివరగా భార్యతో.... నొప్పి పెడుతుంది కీర్తి..అంటూ మాట్లాడిన మాటే గౌతమ్ రెడ్డి చివరి మాటగా నిలిచిపోయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+