ఇసుజు వేదికగా టిపై కిరణ్, గీతారెడ్డి అసంతృప్తి, గైర్హాజరు

హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితి మాత్రమే కొనసాగుతుందని, వ్యాపార, పారిశ్రామిక పరంగా ఎలాంటి అనిశ్చిత్తి లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిత్తురు జిల్లాలో నెలకొల్పనున్న నూతన తయారీ ప్లాంట్ సంస్థను మంత్రి పితాని సత్యనారాయణ, ప్రతినిధులు సుసుము హొసొయ్, హిందెయుకి నబెషిమలతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుతమైన వౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూలంగా ఉండటం వల్లే ఇక్కడ పరిశ్రమల స్థాపనకు వివిధ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీకి ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జపాన్ దేశానికి చెందిన ఇసుజు తమ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలోనెలకొల్పడం, అందులోను తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.

Geeta Reddy expressed angry with Kiran

కాగా, తెలంగాణపై కిరణ్ వైఖరిని నిరసిస్తూ మంత్రి గీతా రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రూ.3000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న మొదటి వాహనాల పరిశ్రమకు హైదరాబాదులోని ఓ హోటల్లో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

దీనికి కిరణ్‌తో పాటు గీతా రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కార్యక్రమం ఆమె శాఖ పరిధిలోనిదే. శిలాఫలకంపై గీతా రెడ్డి పేరు కూడా ఉంది. కాని టి బిల్లును తిప్పి పంపాలని సభలో కిరణ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో దానిని నిరసిస్తూ ఆమె గైర్హాజరయ్యారు. గీతారెడ్డి రావడం లేదని తెలుసుకున్న కిరణ్ మంత్రి పితాని సత్యనారాయణను కార్యక్రమానికి తీసుకొని వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+