జగన్ కేసులో తొలిసారి కోర్టుకు గీతా, ఇవాళే అందరూ!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మంత్రి గీతా రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ ఆస్తుల కేసులో మంగళవారం పది ఛార్జీషీట్ల పైన సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో మంత్రి గీతా రెడ్డి మొదటిసారి కోర్టుకు వచ్చారు.
కాగా, జగన్ కేసులో పది అభియోగ పత్రాల్లో పేర్కొన్న నిందితులు అందరూ మంగళవారం నాంపల్లి కోర్టుకు ఒక్కరొక్కరుగా హాజరవుతున్నారు.

హాజరయ్యే వారిలో జగన్, విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రిలు ధర్మాన, సబిత, మోపిదేవి, మంత్రి గీతా రెడ్డి, అధికారులు బిపి ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, శ్రీలక్ష్మి, ఆధిత్యనాథ్ దాస్, రత్నప్రభ, శ్యాంబాబు, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, శ్రీనివాసన్, ప్రతాప్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పునీత్ దాల్మియా తదితరులు ఉన్నారు.
కాగా, వైయస్ జగన్ ఈ నెల 4న చెన్నై వెళ్లేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. 5న బెంగళూరుకు వెళ్లాలని వేసిన పిటిషన్ పైన 4వ తేదీన విచారిస్తారు. లక్నో వెళ్లడానికి అనుమతిపై ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications