ఛార్జీలు తగ్గించిన APSRTC- ఈ 8 రూట్లల్లో వర్తింపు
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు. ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు.
వివిధ డిపోల నుంచి హైదరాబాద్ కు వెళ్లే ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా తాజాగా ఏసీ బస్సుల్లో 10 శాతం మేర ఛార్జీలను తగ్గించారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ ఆర్టీసీ డిపోల నుంచి హైదరాబాదు వెళ్లే అన్ని ఇంద్ర ఏసీ సర్వీస్, ఏసీ నైట్ రైడర్ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించారు.

మచిలీపట్నం- హైదరాబాద్, అవనిగడ్డ-హైదరాబాద్, గుడివాడ- హైదరాబాద్ మార్గంలో అన్ని ఇంద్ర, ఏసీ నైట్ రైడర్ బస్సుల్లో రెండు వైపులా ప్రయాణానికి ఈ 10 శాతం తగ్గింపు సౌకర్యం పొందవచ్చు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులు ఈ తగ్గింపు అమలులో ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకున్నా లేక బస్సులో టికెట్ తీసుకున్నా రాయితీ వర్తిస్తుంది.
ప్రస్తుతం ఈ విధానం గుంటూరు, తెనాలి డిపోల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే ఏసీ బస్సుల్లో అమలులో ఉన్న విషయం తెలిసిందే. అది సూపర్ సక్సెస్ అవుతోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ విధానం అమలులోకి వచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. 10 శాతం మేర ఛార్జీని తగ్గించినందు వల్ల ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా మెరుగుపడుతోంది. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో 10 శాతం వరకు అంటే ప్రస్తుతం ఉన్న ఛార్జీ 870 నుంచి 790 రూపాయలకు తగ్గుతుంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో ఛార్జీలు ప్రస్తుతం ఉన్న 970 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.
గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 700 నుంచి 640 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి బీహెచ్ ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 770 నుంచి 710 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 960 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications