విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సముద్రం అలల ఉధృతి: చూసి గంటా హామీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జిల్లాలోని భిమీలి బీచ్ రోడ్డులోని మంగమారిపేట వద్ద సముద్ర తీరం గురి కాకుండా ఉండేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ తీరం వద్ద సముద్రం చాలా ముందుకు రావడంతో కూలిపోయిన జాలర్ల ఇళ్లను మంత్రి బుధవారం పరిశీలించారు.

మత్స్యకారులకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ తీరంలో జరుగుతున్న పరిణామాల గురించి దాని పరిష్కారం గురించి ఇప్పటికే విశాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన నిపుణులను కోరామని ఆయన చెప్పారు.

ఆ నివేదిక ప్రయోజనకరంగా లేదని, పూణేకు చెందిన మరో సంస్థకు ఆ పని అప్పగిస్తామని మంత్రి చెప్పారు. బాధితులైన మత్య్యకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు పునరావాసం కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు.

గంటా పరిశీలన

గంటా పరిశీలన

సముద్రం ముందుకు వచ్చి తీరాన్ని కోస్తున్న తీరును మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం మంగమారి పేటలో పరిశీలించారు.

ఇలా ముందుకొచ్చి సముద్రం

ఇలా ముందుకొచ్చి సముద్రం

మంగమారిపేటలో గత మూడు నాలుగు రోజులుగా ఇలా ముందుకు వచ్చి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

సముద్రం ఇలా..

సముద్రం ఇలా..

సముద్రం మంగమారిపేట ముందుకు కొందరు జాలర్ల ఇళ్లను కోతకు గురి చేసింది. వారిని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

అధికారులతో పాటు గంటా

అధికారులతో పాటు గంటా

మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు.

ఆదుకుంటామని గంటా

ఆదుకుంటామని గంటా

నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కోతకు గురి కాకుండా శాశ్వత చర్యలు చేపడుతామని చెప్పారు.

అడిగి తెలుసుకున్నారు...

అడిగి తెలుసుకున్నారు...

సముద్రం ముందుకు రావడం వల్ల నష్టపోయిన జాలర్ల కుటుంబాలతో మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడారు.

English summary
Education Minister Ganta Srinivasa Rao,Dist.collector along with officers visiting eroded beach at Mangamaripeta vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X