కల్తీ నెయ్యిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఉత్తర్వులు జారీ..!

ఏపీలో నెల రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న తిరుమల కల్తీ నెయ్యి (ghee adulteration) వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఇందులో పలు అంశాలను సిట్ విస్మరించిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏక సభ్య కమిటీ మాత్రమే. ఇందులో దినేష్ కుమార్ మాత్రమే విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. లడ్డూ కల్తీ వివాదంలో వచ్చిన ఆరోపణలు, సిట్ నివేదిక, టీటీడీ బోర్డు తప్పిదాలు, అనంతరం తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై దినేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

Ghee Adulteration Scandal AP Govt Appoints Inquiry Committee Recommends Action on TTD Board

ఈ కమిటీ కల్తీ నెయ్యి వివాదానికి కారణమైన టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే నెయ్యి టెండర్ల నిబంధనల్ని సడలించిన వారిపైనా చర్యలకు సిఫార్సు చేయాలి. అప్పట్లో టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత ఉందా లేదా తేల్చాలి. టీటీడీ అధికారులు నిబంధనల్ని ఏమైనా ఉల్లంఘించారా అన్నది కూడా పరిశీలించాలి. ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాలి. టీటీడీలో పాలనాపరమైన తప్పిదాలకు ఈ విచారణను పరిమితం చేయాలి. 45 రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+