హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిహెచ్‌ఎంసి ప్రణాళిక: ఒక్క రూపాయికే టిఫిన్

By Pratap
|
Google Oneindia TeluguNews

GHMC plan to serve tiffin for Re 1
హైదరాబాద్: రూపాయి విలువ పడుతున్న ప్రస్తుత సంక్షోభంలో ఒక్క రూపాయికి ఏమొస్తుంది, ఏమీ రాదు. కానీ హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఒక్క రూపాయికే టిఫిన్ అందించేందుకు సిద్ధపడుతోంది. జిహెచ్ఎంసి పరిధిలో పేదలకు, బడుగలుకు ఒక్క రూపాయికే ఉదయం పూట అల్పాహారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాదు జంటనగరాల్లోని ఎనిమిది కేంద్రాల్లో ఐదు రూపాయలకే జిహెచ్ఎంసి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఈ పథకానికి హరికృష్ణ ఫౌండేషన్ సహకరిస్తోంది. పూరీ, ఇడ్లీ, ఉప్మా వంటి అల్పాహారాన్ని ఒక్క రూపాయికే అందించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.

ఆ విషయాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ సోమశేఖర్ సోమవారంనాడు వెల్లడించారు. ఐదు రూపాయలకు భోజనం అందించే పథకాన్ని ఇప్పటి వరకు 8 కేంద్రాల్లో అమలు చేస్తున్నామని, మరో 42 కేంద్రాలు తెరవాల్సి ఉందని ఆయన చెప్పారు.

త్వరలోనే టిఫిన్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నిరుపేదలకు ఆరోగ్యకరమైన వేడివేడి ఆహారాన్ని అందించానే లక్ష్యంతో ఈ పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Greater Hyderabad municipal corporation (GHMC) will supply brrak fast one rupee, corporation commissioner Somasekhar told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X