మెట్లపై నుంచి జారిపడ్డ గిడ్డి ఈశ్వరి: విరిగిన కాలు ఎముక
పాడేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రమాదానికి గురయ్యరు. మెట్లపై నుంచి జారి పడటంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది.ఆమె ఎడమ కాలును ఎక్స్ రే తీసిన వైద్య సిబ్బంది..
విశాఖపట్నం: పాడేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రమాదానికి గురయ్యరు. మెట్లపై నుంచి జారి పడటంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది. మొన్నటి దాకా నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం నిర్వహించారు.
ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కాకినాడలో ఆమె బస చేసిన భవనంలో మెట్లు దిగుతుండగా.. కాలు జారి పడిపోయారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

అనంతరం చికిత్స కోసం ఈశ్వరి ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఎడమ కాలును ఎక్స్ రే తీసిన వైద్య సిబ్బంది.. కాలులోని ఎముక విరిగినట్లు వెల్లడించారు. అనంతరం చికిత్స పొందిన గిడ్డి ఈశ్వరి.. విశ్రాంతి కోసం పాడేరు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications